నటకిరీటి నవ్వించాడు.. ఏడిపించాడు.. ‘గాలి సంపత్’ ఆకట్టుకుంటున్నాడు..

నటకిరీటి నవ్వించాడు.. ఏడిపించాడు.. ‘గాలి సంపత్’ ఆకట్టుకుంటున్నాడు..

Gaali Sampath: వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పకుడిగా మారి, స్నేహితుడు ఎస్.కృష్ణ నిర్మాణంలో, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, టాలెంటెడ్ యాక్టర్ శ్రీ విష్ణు ప్రధాన పాత్రధారులుగా ‘గాలి సంపత్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Gaali Sampath

ట్రైలర్ అంతా ఫన్నీగా ఆకట్టుకుంది. హీరో, తండ్రి మధ్య మంచి ఎమోషనల్ బాండింగ్‌ని చూపించారు. లవ్లీ సింగ్ కథానాయికగా నటించగా, సత్య, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యర్ కీలకపాత్రల్లో కనిపించారు. అనిల్ రావిపూడి ఈ మూవీకి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో పాటు డైరెక్షన్ సూపర్ విజన్ చేశారు. నిర్మాత ఎస్.కృష్ణ కథనందించారు.

షైన్ స్క్రీన్స్, ఇమేజ్ స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ల మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి, ఎస్.కృష్ణ నిర్మిస్తున్న ‘గాలిసంపత్’ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం : అచ్చు, కెమెరా : సాయి శ్రీరామ్, ఎడిటింగ్ : తమ్మిరాజు.