Gaddar: ‘గాడ్‌ఫాదర్’‌లో గద్దర్ పాత్ర ఇదే!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కాకముందే, మెగాస్టార్ వరుసబెట్టి...

Gaddar: ‘గాడ్‌ఫాదర్’‌లో గద్దర్ పాత్ర ఇదే!

Gaddar Role In Chiranjeevi Godfather Movie Revealed

Gaddar: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కాకముందే, మెగాస్టార్ వరుసబెట్టి తన సినిమాలను లైన్‌లో పెడుతూ బిజీగా ఉన్నాడు. యంగ్ హీరోలకు పోటీగా చిరు వరుసగా సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఇక ఇందులో చిరంజీవి నటిస్తున్న గాడ్‌ఫాదర్ చిత్రం అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ చిత్రానికి తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు మోహన్ రాజా. ఇక ఈ సినిమాలో చిరు పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నారు చిత్ర యూనిట్.

Godfather : చిరంజీవి సినిమాలో గద్దర్?

అయితే ఈ సినిమాలో పలువురు స్టార్స్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను కూడా సల్లూ భాయ్ మొదలుపెట్టాడు. అంతేగాక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ప్రజా గాయకుడు గద్దర్ కూడా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే గాడ్‌ఫాదర్ చిత్రంలో గద్దర్ చేయబోయేది ఎలాంటి పాత్ర అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా గద్దర్ తాజాగా ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాడ్‌ఫాదర్ చిత్రంలోని తన పాత్రకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించడం ఓ కొత్త అనుభూతిని కలిగించిందని గద్దర్ చెప్పుకొచ్చారు.

కాగా గాడ్‌ఫాదర్ చిత్రంలో గద్దర్ చిరంజీవి తండ్రికి స్నేహితుడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథరీత్యా చిరంజీవి జైలుకు వెళ్తాడు. అక్కడ తన తండ్రి స్నేహితుడైన గద్దర్‌ను ఆయన కలుసుకుంటాడు. ఈ నేపథ్యంలో చిరు తండ్రికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చిరంజీవితో పంచుకుంటాడట గద్దర్. ఇక ఈ సినిమాలో ఆయన ఓ విప్లవ చైతన్య గీతాల కళాకారుడిగా కనిపించనున్నట్లు గద్దర్ పేర్కొన్నారు. కాగా ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా ముగించుకున్నట్లు గద్దర్ తెలిపారు.

Godfather: చిరుతో సల్మాన్.. ముంబైలో మొదలు కానున్న యాక్షన్!

గాడ్‌ఫాదర్ చిత్రంలో నటించినందుకు గాను తనకు మంచి పారితోషికం అందించారని గద్దర్ సంతోషం వ్యక్తం చేశారు. మొత్తానికి మరోసారి గద్దర్ తన మార్క్ పాత్రలోనే కనిపించనుండటంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాలో గద్దర్ చేత ఏదైనా పాట పాడిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇక చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.