Gangster Gangaraju : ఓటీటీలోకి ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’.. తెలుగు, తమిళ భాషల్లో..

లక్ష్ చదలవాడ హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’. జూన్ 24న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి...........

Gangster Gangaraju :  చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై లక్ష్ చదలవాడ హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’. జూన్ 24న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం సక్సెస్ ఫుల్‌గా స్ట్రీమ్ అవుతోంది.

లక్ష్ పర్ఫార్మెన్స్ , సాయి కార్తీక్ సంగీతం, కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. చిత్రంలోని పాటలు, ఇంటర్వెల్ బాంగ్, క్లైమాక్స్ మరియు ట్విస్ట్ లు ప్రేక్షకులని ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.

Liger Pre Release Event : ఈ సారి గుంటూరులో అదరగొట్టనున్న విజయ్ దేవరకొండ.. లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. డేట్, ప్లేస్ ఫిక్స్..

విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ చిత్రం ఇక ఇప్పుడు ఓటీటీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న విశేష స్పందనతో ఇప్పటికే తెలుగు, తమిళ్ లో ఉన్న ఈ సినిమాని త్వరలోనే కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఈ చిత్రంలో లక్ష్, వేదిక ద‌త్, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, స‌త్య‌కృష్ణ‌, అన్న‌పూర్ణ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు.

ట్రెండింగ్ వార్తలు