వెన్నులో వణుకు పుట్టిస్తున్న పులి ‘గర్జన’..

వెన్నులో వణుకు పుట్టిస్తున్న పులి ‘గర్జన’..

Garjana Motion Poster: శ్రీరామ్, రాయ్ లక్ష్మీ జంటగా.. జె.పార్థీబన్ దర్శకత్వంలో జాగ్వార్ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కుతున్న థ్రిల్లర్.. ‘గర్జన’. ఇటీవల విడుదల చేసిన టీజర్‌‌కి మంచి స్పందన లభించింది. కొత్తగూడెం తూర్పు అటవీ ప్రాంతంలో 45 ఏళ్ల వ్యవసాయ కూలీని పులి చంపిందనే వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన టీజర్ ఆసక్తి రేకెత్తించింది.
బుధవారం ‘గర్జన’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్.

ఓ ఇంట్లోకి పులి ప్రవేశించడం.. దాని నుండి తప్పించుకోవడానికి కథానాయిక, ఆమె స్నేహితురాలు, చిన్న పాప ఎటువంటి ఇబ్బందులు పడ్డారు. అటవీ అధికారి ఆ పులిని చంపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారనేది మోషన్ పోస్టర్లో వివరంగా చూపించారు. భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఓ పులి ఎక్కువ సేపు తెరపై కనిపించడం అనేది ఈ ‘గర్జన’ సినిమాలోనే కావడం విశేషం.

దేవ్ గిల్, నైరా, వషన్ని, ఆరోహి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. విజువల్స్, ఆర్ఆర్ చక్కగా కుదిరాయి. త్వరలో ‘గర్జన’ ప్రేక్షకుల ముందుకు రానుంది. మ్యూజిక్ : అరుల్‌ దేవ్, ఎడిటింగ్ : ఆర్.సుదర్శన్, స్టోరీ, స్క్రీన్‌ప్లే అండ్ సినిమాటోగ్రఫీ : ఎమ్.వి.పన్నీర్ సెల్వం, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : ఎమ్.నరేష్ జైన్, ప్రొడ్యూసర్ : బి.వినోద్ జైన్, దర్శకత్వం: జె.పార్థీబన్.