Electric Bicycles : గరుడ సైకిల్..10పైసల ఖర్చు..40కిలోమీటర్ల ప్రయాణం

ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల ధరలు కాస్త ఎక్కవగా ఉండటంతో, తేలికపాటి, తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ సైకిళ్ళను కొనుగోలు చేసేందుకు సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.

Electric Bicycles : గరుడ సైకిల్..10పైసల ఖర్చు..40కిలోమీటర్ల ప్రయాణం

De

Electric Bicycles : వాహనాల మార్కెట్లో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. ఈవీ టెక్నాలజీ వైపు అంతా ఆసక్తి చూపుతున్న నేపధ్యంలో పలు ఆటోమొబైల్ కంపెనీలు కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు వాహనాలను తయారీకి అధిక ప్రాధాన్యత నిస్తున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు భారంగా మారటంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది.

ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల ధరలు కాస్త ఎక్కవగా ఉండటంతో, తేలికపాటి, తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ సైకిళ్ళను కొనుగోలు చేసేందుకు సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే నహాక్ మోటార్ ఇలాంటి వారి కోసం తక్కువ బడ్జెట్లో ఈవీ సైకిల్ ను రూపొందించింది. గరుడ, జిప్సీ పేరుతో రెండు మోడళ్ళల్లో సైకిల్ ను కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చింది.

ఈ సైకిల్ ను మామూలు సైకిల్ లా తొక్కుకుంటూ వెళ్ళవచ్చు. తొక్కలేని పరిస్ధితుల్లో బ్యాటరీ సాయంతో ఈవీగా మార్చుకోవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 40 కిలో మీటర్ల దూరం ప్రయాణించవచ్చు. 40 కిలో మీటర్లు ప్రయాణించేందుకు అయ్యే ఖర్చు 10 పైసలు అవుతుంది. గరుడ మోడల్ ధర 31,999రూపాయలుకాగా, జిప్సీ ధర 33,499 రూపాయలుగా నిర్ణయించారు