Gas Problem : కడుపులో గ్యాస్ సమస్య, కారణాలు ఇవే..

నేసమయంలో మాట్లాడుతూ తినటం మంచిదికాదు. ప్రతి ముద్దనూ నింపాదిగా నమిలి తినాలి. క్యాబేజీ, ఉల్లిపాయ, యాపిల్స్‌, అరటిపండు, ముల్లంగి, గోధుమపిండి, మినుములు, కోడిగ్రుడ్లు..

Gas Problem : కడుపులో గ్యాస్ సమస్య, కారణాలు ఇవే..

Gas Problems

Gas Problem : ప్రపంచంలో ప్రస్తుతం మనుషులను బాధిస్తున్న సమస్యలలో గ్యాస్ సమస్య ఒకటి. అధిక శాతం మంది నిత్యం ఈ గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. గ్యాస్‌ అనేది సాధారణంగా మనం తినే ఆహారంతోగాని, తాగే ద్రవపదార్థాలతోగాని, లాలాజలంతోగాని శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనిలో కొంత భాగం ఆమాశయం నుంచి త్రేన్పు రూపంలో బైటకు వెళ్లిపోతే మిగిలిన భాగం పేగులలోకి ప్రవేశించి, అక్కడనుంచి శరీరంలోకి విలీనమవుతుంది. చివరగా మిగిలిన సూక్ష్మాంశం, నత్రజనితో కలిసి మలద్వారం నుంచి వెలుపలకు గ్యాస్‌ రూపంలో వెళ్లిపోతుంది.

ఆహారాన్ని నమలకుండా అమాంతం మింగడం, గ్యాస్‌తో నిండిన కూల్‌డ్రింకులను, సోడాలను తాగడం, పొగాకు, కిళ్లీలు, చాక్లెట్లు, బబుల్‌ గమ్‌లు అదే పనిగా నములుతుండటం, మసాలా పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం ఇటువంటి వాటి వల్ల జీర్ణాశయంలోకి వాయువు ఎక్కువగా ప్రవేశిస్తుంది.

కొన్నిసార్లు ఆందోళన, భయం, ఉద్వేగం వంటి మానసిక కారణాలు సైతం గ్యాస్‌ తయారీకి దోహదపడతాయి. అలాగే కొన్ని సందర్భాల్లో పేగుపూత, అల్సర్లు, శరీరంలో నీరు డీహైడ్రేషన్‌ సందర్భంలో గ్యాస్‌కు కారణమవుతాయి.జీర్ణ వ్యవస్థలోనికి ప్రవేశించిన ఆహారం సూక్ష్మాంశాలుగా విభాజితమయ్యేటప్పుడు పులిసి పోతే, అప్పుడు కూడా గ్యాస్‌ తయారవుతుంది.

పిండి పదార్థాలను సరిగ్గా ఉడికించనప్పుడుగాని, మలబద్దకం విరేచనాలు వంటి స్థితిగతులు ప్రాప్తించినప్పుడుగాని, జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైములు తక్కువైనప్పుడు, యాంటీ బయాటిక్స్‌ను అధికంగా వినియోగించినప్పుడు ఆహారం పేగులలో నిలువ ఉండి, పులిసిపోయి గ్యాస్‌ తయారవుతుంది.

సూచనలు;

తినేసమయంలో మాట్లాడుతూ తినటం మంచిదికాదు. ప్రతి ముద్దనూ నింపాదిగా నమిలి తినాలి. క్యాబేజీ, ఉల్లిపాయ, యాపిల్స్‌, అరటిపండు, ముల్లంగి, గోధుమపిండి, మినుములు, కోడిగ్రుడ్లు… ఇటువంటి వాటి వల్ల గ్యాస్‌ ఎక్కువగా తయారవుతుంది కనుక వీటి వాడకాన్ని తగ్గించాలి. టీ, కాఫీలను ఎక్కువగా మరిగించడం వలన, వీటిల్లో పంచదార ఎక్కువగా కలపడం వల్ల గ్యాస్‌ ఉత్పన్నమౌతుంది. తీపి పదార్థాలు ప్రేవులలోకి వెళ్లి త్వరగా పులిసిపోతాయి. ఫలితంగా వీటినుంచి గ్యాస్‌ వెలువడుతుంది.

కొంతమంది పీచు పదార్థాలు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంతమంచిదనే అభిప్రాయంతో వాటిని అపరిమితంగా తీసుకుంటుంటారు. అయితే నార కలిగిన పీచు పదార్థాల వలన కూడా గ్యాస్‌ తయారయ్యే అవకాశముందని గుర్తించాలి. ఇవి ఆలస్యంగా జీర్ణమవుతూ గ్యాస్‌ను విడుదల చేస్తాయి. బీన్స్‌ వంటి ఆహార పదార్థాలను వాడుకోవడం తగ్గించుకోలేకపోతే వాటిని ఒక రోజంతా నీళ్లలో నానబెట్టి కుక్కర్‌లో ఉడికిస్తే సరిపోతుంది.

పొట్టను పూర్తిగా ఆహారంతో నింపకుండా పావు భాగాన్ని గాలికోసం వదిలివేయడం, భోజనం చేసిన తరువాత కనీసం వంద అడుగులు నడవడం వంటివి కూడా గ్యాస్ లేకుండా చేసేందుకు ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు.