మోడీకి, భారత్‌కు థ్యాంక్స్ చెప్పిన క్రికెటర్ క్రిస్ గేల్.. రస్సెల్ భావోద్వేగం

మోడీకి, భారత్‌కు థ్యాంక్స్ చెప్పిన క్రికెటర్ క్రిస్ గేల్.. రస్సెల్ భావోద్వేగం

Chris Gayle Modi

వెస్టిండీస్ క్రికెట‌ర్ క్రిస్ గేల్‌.. ఇండియాకు కృతజ్ఞతలు చెప్పాడు. కోవిడ్ టీకాల‌ను ఇటీవ‌ల జ‌మైకాకు భార‌త్ స‌ర‌ఫ‌రా చేయగా.. గేల్ కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ వీడియోను పోస్టు చేశాడు. ప్ర‌ధాని మోడికి, భారత ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. భార‌త ప్ర‌భుత్వం, భార‌త ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ డొనేట్ చేసినందుకు థ్యాంక్స్ చెబుతున్నాన‌ు అంటూ గేల్ వీడియోలో చెప్పారు. కరోనా నిర్మూలనకు భార‌త్ చేప‌డుతున్న ప్ర‌య‌త్నాల‌ను ప్రశంసించారు.


మరో విద్వంసకర ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ కూడా భారత్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఇండియా, జమైకా ఇప్పుడు ఇంతకుముందుకంటే బాగా కలిసిపోయాయని, భారత్‌, జమైకా బంధం బ్లడ్ రిలేషన్ అయ్యిందని, సోదరులుగా మారిపోయాం అంటూచ భావోద్వేగ సందేశాన్ని రస్సెల్ అందించారు.


వ్యాక్సిన్ మైత్రిలో భాగంగా.. భారత్ 50వేల డోసుల వ్యాక్సిన్‌ను జమైకాకు అందించగా.. జమైకా భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపింది. జమైకా ప్రధాన మంత్రి ఆండ్రూ హోల్నెస్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన 50 వేల మోతాదుల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను మేము అందుకున్నాం.. దీనిపై దేశం సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు.