Geetha Singh : ఆ హీరోయిన్లు నన్ను అవమానిస్తే.. అల్లరి నరేష్ నన్ను తీసుకెళ్లి మరీ వాళ్ళకి గొప్పగా చెప్పాడు..

గీతా సింగ్ మాట్లాడుతూ.. ''అల్లరి నరేష్ హీరోగా చేసిన ఓ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నప్పుడు షూటింగ్ గ్యాప్ లో అక్కడ ఉన్న క్యారవాన్ ఎక్కాను. అప్పటికే అందులో ఇద్దరు బాంబే హీరోయిన్స్ ఉన్నారు. వాళ్ళు నన్ను చూసి

Geetha Singh : ఆ హీరోయిన్లు నన్ను అవమానిస్తే.. అల్లరి నరేష్ నన్ను తీసుకెళ్లి మరీ వాళ్ళకి గొప్పగా చెప్పాడు..

Geetha Singh says about allari naresh great ness

Geetha Singh :  ఎవడిగోల వాడిదే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కితకితలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది గీతా సింగ్. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా గత కొన్నేళ్లుగా అవకాశాలు లేక అవకాశాల కోసం చూస్తుంది గీతా సింగ్. అప్పుడప్పుడు టీవీ షోలలో, యూట్యూబ్ ఇంటర్వ్యూలలో కనిపించి తన బాధలు చెప్పుకుంటుంది గీతా.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ తన పరువు కాపాడారని చెప్పింది. గీతా సింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయిన తర్వాత కొన్ని అల్లరి నరేష్ సినిమాల్లో కూడా నటించింది. అలా ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు జరిగిన సంఘటనని తెలిపింది గీతా.

Allu Arjun : పుష్ప 1 తగ్గేదేలే.. పుష్ప 2 అస్సలు తగ్గేదేలే..

గీతా సింగ్ మాట్లాడుతూ.. ”అల్లరి నరేష్ హీరోగా చేసిన ఓ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నప్పుడు షూటింగ్ గ్యాప్ లో అక్కడ ఉన్న క్యారవాన్ ఎక్కాను. అప్పటికే అందులో ఇద్దరు బాంబే హీరోయిన్స్ ఉన్నారు. వాళ్ళు నన్ను చూసి ఈమె ఏంటి క్యారవాన్ ఎక్కింది? జూనియర్ ఆర్టిస్ట్ కదా అని చులకనగా మాట్లాడారు. నేను ఏమి మాట్లాడకుండా క్యారవాన్ దిగి లొకేషన్ లో బయటే కూర్చున్నాను. ఈ విషయం ఎవరో అల్లరి నరేష్ గారికి చెప్పారు. దీంతో అల్లరి నరేష్ నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఈమె నాకు బ్రేక్ ఇచ్చిన హీరోయిన్. ఈమెతో చేసిన సినిమా పెద్ద హిట్ అయింది. అని నా గురించి గొప్పగా చెప్పాడు. అప్పట్నుంచి వాళ్లిద్దరూ మేడం అని పిలవడం మొదలుపెట్టారు. నరేష్ కి బాంబే హీరోయిన్స్ దగ్గర నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అది ఆయన మంచితనం” అని తెలిపింది.