Gender Reveal Party : కొంపముంచిన జెండర్ రివీల్ పార్టీ..దంపతులపై 30 క్రిమినల్ కేసుల నమోదు

ఈ క్రమంలోనే ఈ జంట పైరోటెక్నిక్ పరికరాన్ని పేల్చారు. ఒక్కసారిగా ఆప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి

Gender Reveal Party : కొంపముంచిన జెండర్ రివీల్ పార్టీ..దంపతులపై 30 క్రిమినల్ కేసుల నమోదు

Fire

Gender Reveal Party : పుట్టబోయే బిడ్డ ఆడా, మగా తెలిపేందుకు అమెరికాలో ఓ దంపతుల జంట ఏర్పాటు చేసిన పార్టీ పెద్ద ప్రమాదాన్నే తెచ్చిపెట్టింది. అమెరికాలో ఇలాంటి పార్టీలు కొత్తేమి కాకపోయినప్పటికీ కాలిఫోర్నియా సమీపంలోని ఎల్ రాంచ్ డొరాడో పార్కులో చోటు చేసుకున్న ఘటన మాత్రం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జిమెనెజ్ జూనియర్, ఎంజెలా రీనీ జిమినెజ్ దంపతులు తమకు పుట్టబోయే బిడ్డకోసం జెండర్ రివీల్ పార్టీని ఏర్పాటు చేశారు.

అంతా సరదాగా పార్టీ సాగుతున్నసందర్భంలో అసలు ఘట్టం ప్రారంభమైంది. పార్టీలో బ్లూ, పింక్ కలర్ పొగలను రిలీజ్ చేసే పైరోటెక్నిక్ డివైజ్ లను పేలుస్తుంటారు. బ్లూ కలర్ పొగ వస్తే మగ బిడ్డ, పింక్ కలర్ పొగ వస్తే ఆడబిడ్డగా దంపతులు వారి వారి బంధుగణానికి తెలిజేస్తారు. ఈ క్రమంలోనే ఈ జంట పైరోటెక్నిక్ పరికరాన్ని పేల్చారు. ఒక్కసారిగా ఆప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా పొగరాకుండానే మంటలు వ్యాపించాయి. అది చూసి వారంతా కలవరపాటుకు గురయ్యారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మంటలు పరిసరాల్లోని ఇళ్ళకు వ్యాప్తించాయి.

మంటలు క్రమేపి పెరుగుతూ దావానంలా వ్యాప్తి చెందటంతో 23 వేల ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న స్ధానిక పోలీసులు, ఫైరింగ్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాల్లో ఓ అగ్నిమాపక అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు దంపతులిద్దరిపై ఏకంగా 30 క్రిమినల్ కేసులను నమోదు చేశారు.

ఇదిలా వుంటే 2020 సెప్టెంబర్ మాసంలో కాలిఫోర్నియాలో ఇలాంటి ఘటనే జరిగింది. జండర్ రిలీవ్ పార్టీ సందర్భంగా ఫైర్ బాంబ్ పేలుడుతో మంటలు వ్యాపించి అప్పట్లో 10వేల ఎకరాల్లో అడవి దగ్ధమైంది. 10వేల మందిని నివాసాలు ఖాళీ చేయించాల్సిన పరిస్ధితి వచ్చింది.