Mumbai : ఇద్దరి మధ్య ప్రేమ..ప్రియుడి మాటలు నమ్మి లింగ మార్పిడి చేసుకున్నాడు

లింగమార్పిడి చేసుకున్న అనంతరం ప్రియుడు మోసం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  ఈఘటన దేశ వాణిజ్య నగరంగా పేరొందిన ముంబైలో చోటు చేసుకుంది.

Mumbai : ఇద్దరి మధ్య ప్రేమ..ప్రియుడి మాటలు నమ్మి లింగ మార్పిడి చేసుకున్నాడు

Mumbai

Gender Sex Reassignment : ప్రేమ కోసం ఎంత పనికైనా తెగిస్తారు. కొంతమంది దారుణాలకు తెగబడుతుంటే..మరికొందరు త్యాగాలు చేస్తుంటారు. అయితే..ప్రేమ కోసం..ఏకంగా లింగమార్పిడి చేసుకున్నాడో ఓ వ్యక్తి. లింగమార్పిడి చేసుకున్న అనంతరం ప్రియుడు మోసం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  ఈఘటన దేశ వాణిజ్య నగరంగా పేరొందిన ముంబైలో చోటు చేసుకుంది. నగరానికి చెందిన జమాల్ షేక్ … 16 సంవత్సరాల క్రితం…కోల్ కతా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డాడు.

Read More : Karthikeya : సినిమాపై బాధపెట్టేలా విమర్శలు చేయకండి : కార్తికేయ

ఫుర్ ఖాన్ తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఏడాదిన్నరగా వీరు ప్రేమించుకుంటున్నారు. అయితే…తాను గాఢంగా ప్రేమిస్తున్నట్లు..కానీ..లింగ మార్పిడి చేసుకుంటే..పెళ్లి చేసుకుంటానని పుర్ ఖాన్..జమాల్ ను నమ్మించాడు. ఈ మాటలను జమాల్ నమ్మాడు. అనంతరం దాదాపు రూ. 2 లక్షలు ఇచ్చి లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.

Read More : Amit Shah : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా, జగన్

అయితే..ఫుర్ ఖాన్ తనను మోసగించి..ఢిల్లీకి పారిపోయాడంటూ..ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అతడికి అవసరం ఉన్న ప్రతిసారి డబ్బులు ఇచ్చానని, ఫుర్ ఖాన్ కు ఇంతకుముందే..వివాహం జరిగిందని..తనను ప్రేమించాడని చెప్పి..మోసగించాడని ఆరోపిస్తున్నాడు. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరినా…స్పందించడం లేదని జమాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.