VK Sasikala: ఏఐఏడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ఇలా ఎలా ఎన్నుకుంటారు?: శ‌శిక‌ళ‌

''స్వార్థ‌పూరిత రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే పార్టీ విధానాల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ఎన్నుకున్నారు. పార్టీ కార్య‌వ‌ర్గం చ‌ట్ట‌బ‌ద్ధంగా కొన‌సాగ‌ట్లేదు. నా ఏఐఏడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదా కేసు ప్ర‌స్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇటువంటి స‌మమంలో పార్టీ సర్వ‌స‌భ్య‌ స‌మావేశం నిర్వ‌హించ‌డం స‌రికాదు'' అని శ‌శిక‌ళ చెప్పారు.

VK Sasikala: ఏఐఏడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ఇలా ఎలా ఎన్నుకుంటారు?: శ‌శిక‌ళ‌

Tamilnadu Vk. Sasikala Sasikala Name Change

VK Sasikala: ఏఐఏడీఎంకే పార్టీ నుంచి సీనియ‌ర్ నేత‌ ప‌న్నీర్ సెల్వాన్ని తొల‌గించి, ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామిని ఎన్నుకున్న విధానంపై ఆ పార్టీ బ‌హిష్కృత నాయ‌కురాలు శ‌శిక‌ళ మండిప‌డ్డారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ… ”డీఎంకేలో ప‌రిస్థితులు బాగోలేవ‌ని ఎంజీఆర్ అప్ప‌ట్లో ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఏఐఎంఐఎం పార్టీని స్థాపించారు. ఆయ‌న ప్రారంభించిన ఏఐఎంఐఎం పార్టీలో మ‌ళ్ళీ అటువంటి ప‌రిస్థితులు రావ‌ద్దు. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని కార్య‌క‌ర్త‌లే ఎన్నుకునేలా ఎంజీఆర్ ఓ విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు పార్టీలో ఈ విధానాన్ని పాటించ‌ట్లేదు” అని శ‌శిక‌ళ అన్నారు.

AIADMK: ఏఐఏడీఎంకే నుంచి ప‌న్నీర్ సెల్వం తొల‌గింపు.. చెన్నైలో 144 సెక్ష‌న్
”స్వార్థ‌పూరిత రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే పార్టీ విధానాల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ఎన్నుకున్నారు. పార్టీ కార్య‌వ‌ర్గం చ‌ట్ట‌బ‌ద్ధంగా కొన‌సాగ‌ట్లేదు. నా ఏఐఏడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదా కేసు ప్ర‌స్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇటువంటి స‌మమంలో పార్టీ సర్వ‌స‌భ్య‌ స‌మావేశం నిర్వ‌హించ‌డం స‌రికాదు” అని శ‌శిక‌ళ చెప్పారు. ప‌ళ‌నిస్వామిని ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించ‌డ‌మే ఎన్నో సందేహాల‌తో కూడుకుని ఉంద‌ని, అటువంట‌ప్పుడు ఆయ‌న ప‌న్నీర్ సెల్వాన్ని తొల‌గించ‌డం ఎలా చ‌ట్ట‌బ‌ద్ధం అవుంద‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఏఐఏడీఎంకేలో ఏక నాయకత్వం అంశంపై కొన్ని రోజులుగా గందరగోళం నెలకొంది. చివరకు పన్నీర్ సెల్వం వర్గంపై పళనిస్వామి వర్గం పై చేయి సాధించినట్లు అయింది.