55 రోజులుగా ఎయిర్‌పోర్టులోనే ఉన్న జర్మన్ ప్రయాణికుడు

10TV Telugu News

జర్మనీకి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే 55రోజులుగా కాలం గడుపుతున్నాడు. మంగళవారం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ఆమ్‌స్టర్‌డమ్‌కు వెళ్లగలిగాడు. తెల్లవారుజామున KLM flight ఎక్కి ప్రయాణమయ్యే ముందు కొవిడ్-19టెస్టు చేయించుకుని నెగెటివ్ రావడంతో ప్రయాణమయ్యాడు. 

లాక్‌డౌన్ విధించడంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో 54రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇరుక్కుపోయిన జర్మన్ వాసికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అతనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా నిర్వహించారు. 

జిబాట్ అనే ఈ యువకుడు వియత్నాం నుంచి వీట్‌జెట్ ఎయిర్‌లైన్‌తో పాటు కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కి టర్కీలోని ఇస్తాంబుల్ చేరుకున్నాడు. ఇండియా అన్ని రకాల విమాన సర్వీసులు రద్దు చేయడంతో అక్కడ ఎటువంటి విమాన సర్వీసులు అందుబాటులో లేవని అధికారులకు చెప్పాడు. 

ఆ తర్వాత ఎయిర్ పోర్టు అధికారులు అతణ్ని జర్మనీ నడుపుతోన్న స్పెషల్ ఫ్లైట్ ఎక్కి వెళ్లాల్సిందిగా సూచించారు. దానిని ఢిల్లీలోని జర్మన్ ఎంబస్సీ పర్యవేక్షిస్తుంది. ఎంబస్సీ గానీ, ఎయిర్ లైన్స్ కానీ అతను విమానం ఎక్కించుకునేందుకు ఒప్పుకోలేదు. టర్కిష్ ఎయిర్ లైన్ కూడా అతనికి టర్కిష్ పాస్ పోర్టు లేకపోవడంతో విమానం ఎక్కేందుకు అనుమతి ఇవ్వలేదు. 

ఎయిర్ పోర్ట్ ఆపరేటర్ DIAL నిత్యవసరాలైన ఆహారం, బట్టలు, టాయిలెట్ వసతులు, నిద్రపోయేందుకు చోటు ఏర్పాటు చేయడంతో ఎయిర్ పోర్టులోనే ఇన్నిరోజులు ఉండగలిగాడు. 

Read Here>> UAE To INDIA : విమాన టికెట్ల కోసం బంగారం అమ్మేస్తున్న వలస కార్మికులు

×