Publish Date - 1:38 pm, Tue, 2 March 21
German woman becomes TikTok fitness star at 81 : 50 ఏళ్లు దాటాయంటే చాలు..హా ఇంకేముంది ఇక జీవితం అయిపోనట్లే..అని నిరాశ పడిపోతుంటారు చాలామంది. కానీ 80 ఏళ్లు దాటినా ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా సోషల్ మీడియాలో స్టార్ అయిపోయిందో బామ్మ. 80 ఏళ్లంటే కాటికి కాళ్లు చాపుకుని కూర్చున్నట్లేననుకునేవారు 81 ఏళ్ల బామ్మగారు చేసే ‘ ఎక్సర్ సైజులు..చెప్పే మాటలు వింటే ఉస్సూరని మూలన కూర్చున్నవారు సైతం ఉత్సాహంగా లేచి గెంతులేయాల్సిందే. జర్మనీకి చెందిన ఎరికా రిష్కో అనే 81 ఏళ్ల బామ్మ ‘ ఓ మూల కూర్చోకండీ..లేచి ఏదో ఒకటి చేయండీ అంటూ టిక్ టాక్ వీడియోలతో హుషారెత్తిస్తోంది.
సోషల్ మీడియా పుణ్యమాని ఎక్కడెక్కడో ఉండే జాతిరత్నాలు కనిపించి కనువిందు చేస్తున్నాయి. వారిలో ఉండే ప్రతిభ ప్రపంచానికి సాటి చెబుతున్నారు. టిక్ టాక్ వేదికగా ఎరికా రిష్కో అనే 81 ఏళ్ల బామ్మ హుషారు చూస్తే ఈమెకు 81? 21? అనే డౌట్ వచ్చేస్తుంది. లాక్ డౌన్ సందర్భంగా ప్రపంచం మొత్తం ఇంటికే పరిమితమైన సమయంలో ఎరికా మాత్రం టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ..యువతను తలదన్నేలా కసరత్తులు చేసేస్తున్న వీడియోతో స్టార్ అయిపోయారీ బామ్మ.
ఆ విపరీతంగా వైరల్ అవడంతో ఎరికాకు పాపులారిటీ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ..ఎరికా 100కు పైగా ఎక్సర్‌సైజుల వీడియోలు అప్‌లోడ్ చేశారు. కేవలం ఎక్సైర్ సైజు వీడియోలే కాకుండా..అప్పుడప్పుడూ తన భర్తతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఫన్నీ వీడియోలను కూడా టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు ఎరికా.
ఈ వీడియోల్లో అలా ఓ మూల కూర్చోకండి.. లేచి ఎదోకటి చేయండీ..అంటూ తన వీడియోలను చూసే వారిలో స్ఫూర్తి నింపుతున్నారు ఎరికా. అంతేకాదండోయ్..తన ఎక్సైర్ సైజులతో..తన అభిమానులు విసిరే సవాళ్లను కూడా అంతే ధీటుగా ఎదుర్కొంటుర్నారు. ఇంతకీ ఆమెకు ఉన్న ఫాలోవర్లు సంఖ్య అక్షరాలా 1.25 లక్షలు! దటీజ్ ఎరికా రిష్కో ట్యాలెంట్..!!
Jharkhand : తండ్రికి కరోనా పాజిటివ్, రక్షించాలంటూ కూతురు వేడుకోలు..పట్టించుకోని డాక్టర్లు..చివరకు
long Fingernails : 24 అడుగుల పొడవున చేతిగోర్లను పెంచుకున్న మహిళ..30 సంవత్సరాల తరువాత కత్తిరించింది
పెళ్లిలో పుట్టుమచ్చ షాక్ : కూతురే కోడలు కాబోతుందని తెలిసింది..కానీ పెళ్లి ఆగలేదు..!!
Jharkhand woman tonsured : ప్రియుడితో లేచిపోయిందని మహిళకు శిరోముండనం చేయించిన బంధువులు
Madhya Pradesh : తనపై అత్యాచారం చేశాడు…ఎమ్మెల్యే కొడుకుపై ఆరోపణలు
Woman and her gang robbed man : లిఫ్టు కావాలని బైక్ ఎక్కి.. దోపిడీ చేసిన మహిళ