Kitchen Items : వంటింట్లో వస్తువులతో చుండ్రుతోపాటు మరికొన్ని సమస్యలను వదిలించుకోండి

చుండ్రును నివారించటంలో వంటగదిలో ఉండే అల్లం బాగా తోడ్పడుతుంది. ఇందుకోసం అల్లంను మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. దీనికి కాస్త తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి మాడుకు పట్టించాలి. ఆరిన తరువాత కుంకుడు కాయల రసంతో తలస్నానం చేయాలి.

Kitchen Items : వంటింట్లో వస్తువులతో చుండ్రుతోపాటు మరికొన్ని సమస్యలను వదిలించుకోండి

kitchen items

Kitchen Items : వంటింట్లో వస్తువలను అంతతేలికగా తీసి పారేయకండి. ఆరోగ్యానికి వీటి వల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో అనేక వస్తువులు సౌందర్య సాధనాలుగా ఉపయోగపడతాయి. తలలో చుండ్రు సమస్య, చర్మ సౌందర్యం కోసం మార్కెట్లో లభించే ఖరీదైన ఉత్పత్తులను వాడినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అయితే వంటింట్లో లభించే కొన్ని వస్తువులతో ఈ సమస్యలను సులభంగా వదలించుకోవచ్చు. అదెలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

చుండ్రును నివారించటంలో వంటగదిలో ఉండే అల్లం బాగా తోడ్పడుతుంది. ఇందుకోసం అల్లంను మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. దీనికి కాస్త తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి మాడుకు పట్టించాలి. ఆరిన తరువాత కుంకుడు కాయల రసంతో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేయటం వల్ల చుండ్రు సమస్య వదలించుకోవచ్చు.

చర్మం తరచూ పొడిబారిపోతుంటే సోయా పిండిలో కొంచెం తేనె కొద్దిగా పాలు కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తరువత చల్లని నీటితో కడుక్కోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బొప్పాయి గుజ్జులో తేనె , బాదం నూనె ఒక టీస్పూను చొప్పున కలపాలి. ఈ మిశ్రమంతో బాగా రుడ్డుకుంటే చేతులు కాళ్లు మృధువుగా మారతాయి.