తుక్కుకే వాహనాలు.. వదిలించుకోండి త్వరగా!

తుక్కుకే వాహనాలు.. వదిలించుకోండి త్వరగా!

Get Rid Of Obsolete Vehicles Get New Vehicles At A Discount1

రోడ్లపై కాలం చెల్లిన వాహనాలకు కొదవేం లేదు.. అనుమతి లేకపోయినా.. వదులుకోలేక కాలం చెల్లిన వాహనాలతో తిరిగేవాళ్లు ఎక్కువగానే ఉన్నారు. ఈ క్రమంలో ఆర్టీఏ అధికారులు.. ‘కాలం చెల్లిన వాహనాలను వదిలించుకోండి.. రాయితీతో కొత్త వాహనాలు పొందండి’ అంటూ కొత్త నినాదంతో ముందుకు వస్తున్నారు. పాత వాహనాల వినియోగాన్ని ఉపేక్షించేది లేదని అంటున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి కేంద్ర నిబంధనలు అమల్లోకి రానున్న సందర్భంగా అధికారులు వాహనదారులను అలర్ట్‌ చేస్తున్నారు.

ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే 3 లక్షల వాహనాలు కాలం చెల్లినట్లుగా గుర్తించారు. అధికారులు. ఇరవై ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు.. పదిహేనేళ్లు దాటిన వాణిజ్య వాహనాల సేవలకు స్వస్తి చెప్పేందుకు సమాయత్తం అవుతున్నారు అధికారులు. ఆ పాత వాహనాలను తుక్కు చేస్తే 5 శాతం రాయితీతో కొత్త వాహనం కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించడంపై వాహనదారులు కొంత ఉపశమనంగా భావిస్తున్నారు. దీనిపై మార్గదర్శకాలు రావాల్సి ఉండగా.. అవగాహన కల్పిస్తున్నారు అధికారులు.

మొత్తం గ్రేటర్ పరిధిలో 64లక్షల వాహనాలు ఉంటే అందులో మూడు లక్షలకు పైగా వాహనాలు.. 20ఏళ్లు దాటినవిగా చెబుతున్నారు అధికారులు. రవాణ శాఖ రికార్డులు ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోటి 20లక్షల వాహనాలు ఉంటే అందులో సగ భాగం గ్రేటర్‌ పరిధిలోనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త విధానాల్లో భాగంగా.. రెన్యువల్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ చేయకుండా తుక్కుగా చేసే చర్యలు తీసుకోనున్నారు.