Krishana : ఘట్టమనేని గెట్ టూ గెదర్..
ఘట్టమనేని కుటుంబ సభ్యలు గెట్ టూ గెదర్ ఏర్పాటు చేశారు.. కృష్ణ, సుధీర్ బాబు ఫ్యామిలీతో పాటు, సీనియర్ నటుడు నరేష్ కూడా వారితో కలిశారు..

Krishana: ఎప్పుడూ షూటింగ్స్, బిజినెస్ పనులు, రాజకీయాలతో బిజీగా ఉండే సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులు వీలైనప్పుడల్లా కలుస్తుంటారు. అయితే ఈ మధ్య కృష్ణ చిన్నల్లుడు, యంగ్ హీరో సుధీర్ బాబు తన ఫ్యామిలీతో కలిసి కృష్ణ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నారు.
Super Star Krishna : సుధీర్ బాబు ఇంట్లో కృష్ణ గారి బర్త్‌డే సెలబ్రేషన్స్..
గతేడాది నవంబర్ 22న కృష్ణ, ఇందిర దంపతుల వివాహ వార్షికోత్సవంతో పాటు సుధీర్ బాబు, ప్రియదర్శినిల పెద్ద కుమారుడు చరిత్ పుట్టినరోజు కూడా కావడంతో కృష్ణ, సుధీర్ బాబుల ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.
కొద్దిరోజుల క్రితం కృష్ణ పుట్టినరోజును తన ఇంట్లో, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు సుధీర్ బాబు. రీసెంట్‌గా మరోసారి ఘట్టమనేని కుటుంబ సభ్యలు గెట్ టూ గెదర్ ఏర్పాటు చేశారు. కృష్ణ, సుధీర్ బాబు ఫ్యామిలీతో పాటు, సీనియర్ నటుడు నరేష్ కూడా వారితో కలిశారు. నటి పవిత్ర లోకేష్ కూడా ఫొటోల్లో సందడి చేశారు.
Time becomes good to great … When it’s with family ❤️ pic.twitter.com/ojLUYKbnjO
— Sudheer Babu (@isudheerbabu) June 16, 2021
— Sudheer Babu (@isudheerbabu) June 16, 2021