GHMC Elections Live Updates : హైటెక్ సిటీ కోసం బీజేపీ-టీఆర్ఎస్ పోటాపోటీ

  • Published By: sreehari ,Published On : December 4, 2020 / 10:40 AM IST
GHMC Elections Live Updates : హైటెక్ సిటీ కోసం బీజేపీ-టీఆర్ఎస్ పోటాపోటీ

[svt-event title=”సంబరాలు ఆపేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు” date=”04/12/2020,5:57PM” class=”svt-cd-green” ] టీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోవడంతో సంబరాలు ఆపేసింది. ప్రగతి భవన్ వద్ద గెలుపు సంబరాలు చేసుకునేందుకు భారీగా మోహరించిన కార్యకర్తలు సైలెంట్ అయిపోయారు. మ్యాజిక్ ఫిగర్ అందుతుందని భావించిన టీఆర్ఎస్ కు షాక్ తగిలినట్లు అయింది. వరద ప్రభావంతో పాటు సైబర్ ప్రాంతాలైన మాదాపూర్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలు బీజేపీకే మొగ్గు చూపాయి. [/svt-event]

[svt-event title=”మేయర్ భార్య విజయం” date=”04/12/2020,4:38PM” class=”svt-cd-green” ] చర్లపల్లిలో మేయర్ రామ్మోహన్ భార్య విజయం సాధించింది. ఇదిలా ఉండగా ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి భార్య స్వప్ప ఓటమికి గురైంది. [/svt-event]

[svt-event title=”సైబర్ ప్రాంతాల్లో టీఆర్ఎస్‌కు షాక్” date=”04/12/2020,4:10PM” class=”svt-cd-green” ] బలంగా భావించిన హై టెక్ సిటీ ప్రాంతాలైన మాదాపూర్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి ఏరియాల్లో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని కోల్పోయింది. బీజేపీ పుంజుకోవడంతో టీఆర్ఎస్ నేతలకు షాక్ తగిలినట్లు అయింది. [/svt-event]

[svt-event title=”పాతబస్తీలో 23వ డివిజన్లలో ఎంఐఎం గెలుపు” date=”04/12/2020,3:50PM” class=”svt-cd-green” ] శాలిబండ, మెహిదీపట్నం, రమ్నాస్ పురా, దూద్ బౌలి, రియాసత్ నగర్, బార్కాస్, డబీర్ పురా, టోలిచైకి, నానలనగర్, చాంద్రాయణ గుట్ట, పత్తర్ గట్టి, సంతోష్ నగర్, అహ్మద్ నగర్, తలాబ్ చంచలం డివిజన్లలో ఎంఐఎం గెలుపొందింది. [/svt-event]

[svt-event title=”పాత బస్తీలో 16డివిజన్లలో ఎంఐఎం గెలుపు” date=”04/12/2020,3:04PM” class=”svt-cd-green” ] నవాబ్ సాహెబ్ కుంట, శాలిబండ, మెహదీపట్నం, రమ్నాస్ పురా, దూద్ బౌలి, రియాసత్ నగర్, కిషన్ బాగ్, దత్తాత్రేయ నగర్, బార్కాస్, డబీర్ పురా, టోలిచౌకి, నానల్ నగర్, చాంద్రాయణ గుట్ట, పత్తర్ గట్టి, సంతోష్ నగర్, అహ్మద్ నగర్, తలాబ్ చంచలంలలో ఎంఐఎం గెలుపొంది సత్తా చాటింది. [/svt-event]

[svt-event title=”భారీ బందోబస్తుతో అప్రమత్తం” date=”04/12/2020,2:51PM” class=”svt-cd-green” ] ప్రతి కౌంటింగ్ వద్ద 144సెక్షన్ అమలులో ఉంది. 50వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అల్లర్లు జరగకూడదనే నెపంతో ర్యాలీలు, ఊరేగింపులను నిషేదించారు. [/svt-event]

[svt-event title=”పాతబస్తీలో 13 డివిజన్లలో ఎంఐఎం గెలుపు” date=”04/12/2020,14:20PM” class=”svt-cd-green” ]
గ్రేటర్ ఎన్నికల్లో పాతబస్తీలో ఎంఐఎం హవా కొనసాగుతోంది. 13 డివిజన్లలో విజయం సాధించింది. టోలీచౌకీలో అయేషా, నానల్ నగర్ లో నసీరుద్దీన్, సంతోష్ నగర్ లో ముజాఫర్ హుస్సేన్, రియాసత్ నగర్ లో ముస్తాఫా బేగ్, దూద్ బౌలిలో మహ్మద్ సలీమ్, రాంనాస్ పురాలో రాజ్ మోహన్ విజయం సాధించారు.

చంద్రాయణగుట్టలో అబ్దుల్ వాహబ్, పత్తర్ గట్టిలో సోహై ఖాద్రి, బార్కాస్ లో షబానా బేగం, అహ్మద్ నగర్ లో సుల్తానా, డబీర్ పురాలో అలందార్ హుస్సేన్, మెహిదీపట్నంలో మాజిద్ హుస్సేన్ గెలుపొందారు. గతంలో మాజిద్ హుస్సేన్ జీహెచ్ఎంసీ మేయర్ గా పని చేశారు.

టీఆర్ఎస్ 4, క్రాంగ్రెస్ 1, బీజేపీ 1 డివిజన్లలో గెలుపొందాయి. గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. టీఆర్ ఎస్ 57, ఎంఐఎం 33, బీజేపీ 32, కాంగ్రెస్ 2 డివిజన్ లో ఆధీక్యంలో కొనసాగుతున్నాయి.[/svt-event]

[svt-event title=”మెదక్ జిల్లాలో మూడు డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యం” date=”04/12/2020,14:20PM” class=”svt-cd-green” ]
మెదక్ జిల్లాలోని మూడు డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. పటాన్ చెరులో 3090 ఆధిక్యంలో కొనసాగుతోంది. భారతీనగర్ లో 2,200 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. ఆర్సీపురంలో రెండో రౌండ్ తర్వాత 5వేల ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ విజయం సాధించింది.[/svt-event]

[svt-event title=”నాలుగు చోట్లా టీఆర్ఎస్-బీజేపీ మధ్య హోరాహోరీ” date=”04/12/2020,14:20PM” class=”svt-cd-green” ]
నాలుగు చోట్లా టీఆర్ఎస్-బీజేపీ మధ్య హోరాహోరీ నడుస్తోంది. గచ్చిబౌలి, కొండాపూర్, శేరిలింగంపల్లి, మాదాపూర్‌లో మొదటి రౌండ్ కౌంటింగ్ పూర్తి అయింది. ఎర్రగడ్డ డివిజన్ లో త్రిముఖ పోటీ కొనసాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం నువ్వానేనా అన్నట్టుగా పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి.మల్కాజ్‌గిరిలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటాపోటీ ఉంది.150 ఓట్ల లీడ్ లో బీజేపీ అభ్యర్థి కొనసాగుతున్నారు.[/svt-event]

[svt-event title=”నానల్ నగర్, టోలీచౌకీలో ఎంఐఎం… 10వేలకుపైగా మెజారిటీ” date=”04/12/2020,14:11PM” class=”svt-cd-green” ] నానల్ నగర్, టోలీచౌకీలో ఎంఐఎం గెలిచింది. రెండు డివిజన్లలోనూ 10వేలకు పైగా మెజారిటీ సాధించింది. టోలిచౌకిలో అయేషా ఉమేరా (ఎంఐఎం) గెలవగా, నానల్ నగర్ లో నసీరుద్దీన్ (ఎంఐఎం) గెలిచింది. [/svt-event]

[svt-event title=”గ్రేటర్‌లో జోరుమీదున్న కారు : టీఆర్ఎస్ ఖాతాలోకి రంగారెడ్డి, హైదర్ నగర్ ” date=”04/12/2020,13:45PM” class=”svt-cd-green” ]
హైదర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలిచింది. టీఆర్ఎస్ అభ్యర్థి నార్నె శ్రీనివాసరావు విజయం సాధించారు. రంగారెడ్డి నగర్ లో టీఆర్ఎస్ గెలిచింది. టీఆర్ఎస్ అభ్యర్థి విజయ్ శేఖర్ విజయం సాధించారు. ఇప్పటికే మెట్టుగూడ, హైదర్ నగర్ డివిజన్లు టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. 120 డివిజన్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 10 డివిజన్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 20 డివిజన్లలో కౌంటింగ్ ప్రారంభం కానుంది. [/svt-event]

[svt-event title=”ఖైర‌తాబాద్‌, జూబ్లీహిల్స్ డివిజ‌న్ల‌లో టీఆర్ఎస్ ఆధిక్యం” date=”04/12/2020,13:30PM” class=”svt-cd-green” ] గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిపల్ కార్పొకేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. తొలిరౌండ్ ఫ‌లితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఖైర‌తాబాద్‌, జూబ్లీహిల్స్ డివిజ‌న్ల‌లో గులాబీ హవా కొన‌సాగుతోంది.[/svt-event]

[svt-event title=”మెట్టుగూడలో టీఆర్ఎస్ గెలుపు” date=”04/12/2020,13:14PM” class=”svt-cd-green” ] గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం బోణీ కొట్టాయి. మెహిదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించింది. మెట్టుగూడలో టీఆర్ఎస్ గెలుపొందింది. ఏఎస్ రావు నగర్ లో కాంగ్రెస్ విక్టరీ సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి శిరిషారెడ్డి గెలుపొందారు. టీఆర్ఎస్ 52, ఎంఐఎం 25, బీజేపీ 26, కాంగ్రెస్ 2 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.[/svt-event]

[svt-event title=”ఏఎస్ రావు నగర్ లో కాంగ్రెస్ విజయం” date=”04/12/2020,13:12PM” class=”svt-cd-green” ]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం బోణీ కొట్టాయి. మెహిదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించింది. మెట్టుగూడలో టీఆర్ఎస్ గెలుపొందింది. ఏఎస్ రావు నగర్ లో కాంగ్రెస్ విక్టరీ సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి శిరిషారెడ్డి గెలుపొందారు. టీఆర్ఎస్ 51, ఎంఐఎం 23, బీజేపీ 26, కాంగ్రెస్ 1 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.[/svt-event]

[svt-event title=”గోషామహల్‌లో అన్ని డివిజన్లలో బీజేపీ ఆధిక్యం” date=”04/12/2020,12:53PM” class=”svt-cd-green” ]గోషమహల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్‌లో మెట్టుగూడ, యూసుఫ్ గూడ లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంటే.. బేగంబజార్, గోషా మహల్, దత్తాత్రేయనగర్ లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. జాంబాగ్,గన్ ఫౌండ్రీ, మంగళ్ హాట్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ 38, ఎంఐఎం 18, బీజేపీ 22 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.

టీఆర్ఎస్ ఆధిక్యం : కేపీహెచ్ బీ, కొత్తపేట, సరూర్ నగర్, హస్తినాపురం, ఆర్సీపురం, పటాన్ చెరు, చందానగర్, హఫీజ్ పేట్ [/svt-event]

[svt-event title=”గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం బోణి ” date=”04/12/2020,12:24PM” class=”svt-cd-green” ]గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం బోణి కొట్టాయి. ఏఎస్ రావు నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి శిరీషార రెడ్డి గెలిచారు. మెహదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ విజయం సాధించారు. [/svt-event]

[svt-event title=”గ్రేటర్ ఎన్నికల్లో తొలి ఫలితం : మెహిదీపట్నంలో ఎంఐఎం గెలుపు” date=”04/12/2020,12:18PM” class=”svt-cd-green” ]
గ్రేటర్ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చింది. మెహదీపట్నంలో ఎంఐఎం గెలిచింది. ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ విజయం సాధించారు.[/svt-event]

[svt-event title=”గ్రేటర్ ఫలితాల్లో కారు జోరు : మెజార్టీ స్థానాల్లో టీఆర్ఎస్ ముందంజ” date=”04/12/2020,12:14PM” class=”svt-cd-green” ]
గ్రేటర్ ఎన్నికల్లో తొలి రౌండ్ లెక్కింపు ముగిసింది. కొన్ని డివిజన్లలో తొలి రౌండ్ ఫలితాలు వెలువబడు తున్నాయి. మెజారిటీ స్థానాల్లో టీఆర్ఎస్ ముందంజలో కొనసాగుతోంది. ఆర్సీపురం, పటాన్ చెరు, చందానగర్, హఫీజ్ పేట్ లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. హైదర్ నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఓల్డ్ బోయిన్ పల్లిలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. బాలానగర్, చర్లపల్లి, కాప్రా, మీర్ పేట్, శేరిలింగంపల్లిలోనూ టీఆర్ఎస్ లీడ్ లో కొనసాగుతోంది. గాజాలరామారం, రంగారెడ్డి నగర్, కొత్తపేటలో టీఆర్ఎస్ లీడ్ లో ఉంది. కేపీహెచ్ బీ, మూసాపేటలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. కొత్తపేట, సరూర్ నగర్, హస్తినాపురం, వనస్థలిపురంలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. చైతన్యపురి, గడ్డిఅన్నారం, ఆర్కేపురం, హయత్ నగర్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. [/svt-event]

[svt-event title=”జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్..మేయర్ భార్య బొంతు శ్రీదేవి వెనుకంజ” date=”04/12/2020,12:14PM” class=”svt-cd-green” ] జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. చర్లపల్లి డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థి మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి వెనుకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి కె.సురేందర్ ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. రెగ్యులర్ బ్యాలెట్ మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం పోలైన ఓట్లు దాదాపు 35 లక్షలు. మొత్తం 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు. కాసేపట్లో తొలి రౌండ్ లోనే మెహిదీపట్నం డివిజన్ ఫలితం వెలువడనుంది. [/svt-event]

[svt-event title=”తొలిరౌండ్‌లో టీఆర్ఎస్ 15, బీజేపీ 6 డివిజన్లలో ఆధిక్యం” date=”04/12/2020,10:33AM” class=”svt-cd-green” ] గ్రేటర్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలిరౌండ్‌లో టీఆర్ఎస్ 15, బీజేపీ 6 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. సరూర్ నగర్ సర్కిల్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 4 డివిజన్లలో ఆధిక్యం దిశగా బీజేపీ కొనసాగుతోంది. కొత్తపేట డివిజన్ లో టీఆర్ఎస్-బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా నడుస్తోంది.[/svt-event]

[svt-event title=”పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ పూర్తి” date=”04/12/2020,10:33AM” class=”svt-cd-green” ] గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాత్రమే లెక్కించారు. రెగ్యులర్ బ్యాలెట్ మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం పోలైన ఓట్లు దాదాపు 35 లక్షలు. మొత్తం 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు. కాసేపట్లో తొలి రౌండ్ లోనే మెహిదీపట్నం డివిజన్ ఫలితం వెలువడనుంది.[/svt-event]

[svt-event title=”మరికాసేపట్లో తొలి రౌండ్ ఫలితం..” date=”04/12/2020,10:33AM” class=”svt-cd-green” ]
గ్రేటర్ లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హైదర్‌నగర్‌లో తొలి రౌండ్ పూర్తి అయింది. హైదర్ నగర్‌లో కాసేపట్లో తొలి రౌండ్ ఫలితం వెల్లడికానుంది. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. టీఆర్ఎస్ వెనుకంజలో ఉంది. బీజేపీ 88, టీఆర్ఎస్ కు 33 పోస్టల్ బ్యాలెట్లు పోల్ అయ్యాయి. తొలి రౌండ్‌లో లెక్కింపు తుది దశకు చేరుకుంది. మరికాసేపట్లో తొలి రౌండ్ ఫలితం వెలువడనుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను సిబ్బంది లెక్కించారు. మెజార్టీ డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. [/svt-event]

[svt-event title=”77స్థానాల్లో బీజేపీ.. 31స్థానాల్లో టీఆర్ఎస్” date=”04/12/2020,10:33AM” class=”svt-cd-green” ] బల్దియా ఎన్నికల్లో పోరులో భారతీయ జనతా పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు కాషాయ పార్టీ 77 చోట్ల ఆధిక్యం దక్కించుకోగా.. అధికార టీఆర్ఎస్ 31 చోట్ల ముందంజలో ఉంది. ఎంఐఎం 15 చోట్ల, కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. [/svt-event]

[svt-event title=”భారతీనగర్‌లో బీజేపీ.. శేరిలింగంపల్లిలో టీఆర్ఎస్..” date=”04/12/2020,9:10AM” class=”svt-cd-green” ] ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ ప్రకారం భారతీనగర్ డివిజన్‌లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి సీ.హెచ్‌.గోదావరి ఆధిక్యంలో సాగుతుండగా.. శేరిలింగంపల్లి డివిజన్‌లో TRS ఆధిక్యంలో సాగుతుంది. ఆ పార్టీ అభ్యర్థి నాగేంద్ర యాదవ్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. [/svt-event]

[svt-event title=”ఫస్ట్ రౌండ్‌లోనే మెహదీపట్నం ఫలితం” date=”04/12/2020,9:07AM” class=”svt-cd-green” ] ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. బ్యాలెట్ ఓట్లు లెక్కింపు కారణంగా సాధారణంగా కంటే ఇప్పుడు ఫలితం ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలో గ్రేటర్ ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లు పడిన మెహదీపట్నంలో తొలి ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ డివిజన్లో అత్యల్పంగా 11,818 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ డివిజన్ ఫలితమే త్వరగా వచ్చే అవకాశం ఉంది. [/svt-event]

[svt-event title=”ముందంజలో బీజేపీ.. 14చోట్ల ఆధిక్యంలో!” date=”04/12/2020,9:01AM” class=”svt-cd-green” ] ఉత్కంఠగా సాగిన గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ హైదరాబాద్ నగరంలో పలుచోట్ల సాఫీగా సాగుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించగా.. 14 చోట్ల BJP ఆధిక్యంలో నిలిచింది. టీఆర్ఎస్ పార్టీ 6 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. [/svt-event]

[svt-event title=”కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ” date=”01/12/2020,4:32PM” class=”svt-cd-green” ] గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అనంతరం బ్యాలెట్ పత్రాలు లెక్కించనున్నారు. 30 కౌంటింగ్ కేంద్రాల్లో 150 డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 166 కౌంటింగ్ హాల్స్‌ను అధికారులు సిద్ధం చేశారు. ప్రతిహాల్‌లో 14 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు ముగ్గురు చొప్పున కౌంటింగ్ సిబ్బంది ఉంటారు. కౌంటింగ్ ప్రక్రియలో మొత్తం 8వేల 152మంది సిబ్బంది పాల్గొంటున్నారు. బాక్సుల్లో నిక్షిప్తమైన 11 వందల 22 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనుంది. [/svt-event]

[svt-event title=” గ్రేటర్‌ కౌంటింగ్ .. ఓట్ల లెక్కింపు ప్రారంభం  ” date=”01/12/2020,4:32PM” class=”svt-cd-green” ]యావత్ తెలంగాణ రాష్ట్రం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బల్దియా ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది మెహదీపట్నం నుంచి మైలార్‌దేవ్ పల్లి వరకు కౌంటింగ్ సరళి కొనసాగనుంది. హైదరాబాద్ షహర్‌ కా షా ఎవరనేది తేలిపోనుంది. గ్రేటర్‌ పీఠంపై కూర్చునేదెవరో.. మధ్యాహ్నం లోగా క్లారిటీ రానుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలకు ఎస్‌ఈసీ సర్వం సిద్ధం చేసింది.

మొదటి రౌండ్‌లోనే మెహదీపట్నం ఫలితం తేలిపోనుండగా.. చివరిగా మైలార్‌దేవ్‌పల్లి విజేత ఎవరో వెల్లడి కానుంది.గ్రేటర్ పీఠం ఎవరిదో తేల్చేందుకు ఎస్‌ఈసీ సర్వం సిద్ధం చేసింది. ఉదయం 8గంటల నుంచి బల్దియా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించనుంది. బాక్సుల్లో నిక్షిప్తమైన 11 వందల 22 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనుంది. గెలిచేది ఎవరో.. ఓడేది ఎవరో క్లారిటీ ఇవ్వనుంది. [/svt-event]