గ్రేటర్ ఎన్నికల్లో తొలి ఫలితం..మెహిదీపట్నంలో ఎంఐఎం గెలుపు

  • Published By: bheemraj ,Published On : December 4, 2020 / 12:32 PM IST
గ్రేటర్ ఎన్నికల్లో తొలి ఫలితం..మెహిదీపట్నంలో ఎంఐఎం గెలుపు

Mehidipatnam MIM victory : గ్రేటర్ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. మెహిదీపట్నంలో ఎంఐఎం గెలుపొందింది. ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ విజయం సాధించారు. గతంలో ఆయన జీహెచ్ఎంసీ మేయర్ గా పని చేశారు.



గ్రేటర్ ఎన్నికల్లో తొలి రౌండ్ లెక్కింపు ముగిసింది. కొన్ని డివిజన్లలో తొలి రౌండ్ ఫలితాలు వెలువబడు తున్నాయి. మెజారిటీ స్థానాల్లో టీఆర్ఎస్ ముందంజలో కొనసాగుతోంది. ఆర్సీపురం, పటాన్ చెరు, చందానగర్, హఫీజ్ పేట్ లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.



హైదర్ నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఓల్డ్ బోయిన్ పల్లిలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. బాలానగర్, చర్లపల్లి, కాప్రా, మీర్ పేట్, శేరిలింగంపల్లిలోనూ టీఆర్ఎస్ లీడ్ లో కొనసాగుతోంది. గాజాలరామారం, రంగారెడ్డి నగర్, కొత్తపేటలో టీఆర్ఎస్ లీడ్ లో ఉంది.



కేపీహెచ్ బీ, మూసాపేటలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. కొత్తపేట, సరూర్ నగర్, హస్తినాపురం, వనస్థలిపురంలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. చైతన్యపురి, గడ్డిఅన్నారం, ఆర్కేపురం, హయత్ నగర్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.