మోహన్ బాబుకు భారీ జరిమానా

మోహన్ బాబుకు భారీ జరిమానా

Mohan Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్‌ బాబుకు బల్దియా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫైన్ వేసింది. ఎల్‌ఈడీ లైట్లతో కూడిన భారీ హోర్డింగ్‌ను ఇంటి బయట ఏర్పాటు చేసినందుకు గాను ఏకంగా లక్ష రూపాయల భారీ జరిమానా విధించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం ఆయనకు చలాన్ జారీ చేసింది.

ముందస్తుగా ఎటువంటి రాత పూర్వక అనుమతి లేకుండా భారీ ప్రకటన బోర్డును ఏర్పాటు చేసినందుకు ఈ జరిమానా విధిస్తున్నట్టు పేర్కొన్నారు. మోహన్ బాబు, తమ కుటుంబ సభ్యులు నటించిన సినిమాల పోస్టర్లతో, ఎల్ఈడీ లైటులతో ఇంటి ముందు భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు.

ఈ హోర్డింగ్ బిల్డింగ్ ఫ్రంటేజ్‌కు 15 శాతం దాటిపోయిందని, పైగా అనుమతి తీసుకోలేదు కాబట్టి జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నట్టు బల్దియా అధికారులు పేర్కొన్నారు. కాగా మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’, మంచు విష్ణు ‘మోసగాళ్లు’, మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాసి’ సినిమాలు చేస్తున్నారు. మంచు లక్ష్మీ ‘పిట్టకథలు’ వెబ్ సిరీస్‌లో కీలకపాత్రలో నటించారు.

Mohan Babu