Dandruff : చుండ్రు సమస్యకు అల్లంతో చికిత్స!

దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్ , యాంటీమైక్రోబయల్ లక్షణాల కారణంగా, అల్లం రసం చర్మం, కుదుళ్ల ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చు.

Dandruff : చుండ్రు సమస్యకు అల్లంతో చికిత్స!

Dandruff

Dandruff : చుండ్రు అనేది తలలో వచ్చే ఒక విధమైన ఫంగల్ ఇన్ ఫెక్షన్. చుండ్రు రావటానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. తలో నూనె గ్రంధులు స్రవించటం తగ్గటం, కెమికల్స్ ఉండే షాంపుల వినియోగం, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, తలస్నానం చేయకపోవటం వంటి వాటి వల్ల చుండ్రు వస్తుంది. చుండ్రు కారణంగా చాలా మంది దురద, చికాకు వంటి పరిస్ధితులను ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా చలికాలంలో ఈసమస్య తారాస్ధాయిలో ఉంటుంది. చుండ్రు సమస్యను తొలగించుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అల్లంతో చుండ్రు సమస్యను శులభంగా తొలగించుకోవచ్చన్ని నిపుణులు సూచిస్తున్నారు.

అల్లం, అడ్రాక్ అని కూడా పిలుస్తారు, ఇది దక్షిణ ఆసియాలో, ముఖ్యంగా భారతీయ గృహాలలో ఒక సాధారణ మసాలా. ప్రసిద్ధ ఆహార పదార్ధంగా కాకుండా, వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు అద్భుతమైన నివారణిగా దోహదపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌తో పోరాడడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అల్లం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. గొప్ప సౌందర్య పదార్ధం కూడా దోహదపడుతుంది.

దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్ , యాంటీమైక్రోబయల్ లక్షణాల కారణంగా, అల్లం రసం చర్మం, కుదుళ్ల ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చు. అల్లం రసం దురద, చుండ్రు నివారణలో సహాయపడుతుంది. ఇది చుండ్రును తొలగించేందుకు పురాతన కాలం నుండి అల్లాన్ని చికిత్సల్లో వాడుతున్నారు. చుండ్రు సహజ నివారణిగా, జుట్టు రాలడాన్ని నిరోధించేందుకు అల్లం రసాన్ని ఉపయోగించవచ్చు.

అల్లం రసం గొప్ప యాంటీ ఫంగల్, క్రిమినాశక లక్షణాలతో కూడిన శక్తివంతమైన పదార్ధంగా చెప్పవచ్చు. అల్లం సారాన్ని ఉపయోగించడం ద్వారా మొండి చుండ్రును వదిలించుకోవచ్చు. రసం pH స్థాయిని మెరుగుపరచడం, తలపై రక్త ప్రసరణను మెరుగుపరచడం వంటి అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. అల్లం రసాన్ని తలకు షాంపులా కూడా ఉపయోగించవచ్చు. ఒక చెంచా అల్లం రసాన్ని సల్ఫేట్ లేని షాంపూలో కలుపుకోవాలి. అనంతరం ఆమిశ్రమంతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టుపై ఉన్న మురికి పోతుంది.

అల్లాన్ని శుభ్రం చేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ అల్లం పేస్ట్‌లో నిమ్మ ర‌సం, పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి. అర గంట పాటు ఆర‌నివ్వాలి. అనంత‌రం కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే షాంపూతో హెడ్ బాత్ చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు తొలగిపోతుంది. అల్లం నుంచి ర‌సం తీసుకుని అందులో తుల‌సి ఆకుల ర‌సం మ‌రియు నువ్వుల నూనె వేసి మిక్స్ చేసుకోవాలి. దానిని తలకు రాసుకుని అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య పోతుంది.