Arvind Kejriwal: సీబీఐ, ఈడీ నా చేతిలో ఒక్క రోజు ఉన్నా.. సగం మంది బీజేపీ నేతలు జైలుకే: అరవింద్ కేజ్రీవాల్

సీబీఐ, ఈడీ సంస్థలు తన చేతికి ఒక్క రోజు వస్తే చాలని, సగం మంది బీజేపీ నేతలు జైల్లోనే ఉంటారని వ్యాఖ్యానించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. బీజేపీ తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందన్నారు.

Arvind Kejriwal: సీబీఐ, ఈడీ నా చేతిలో ఒక్క రోజు ఉన్నా.. సగం మంది బీజేపీ నేతలు జైలుకే: అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal: కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను తన చేతికి ఒక్క రోజు అప్పగిస్తే చాలని, సగం మంది బీజేపీ నేతలు జైలుకే వెళ్తారని వ్యాఖ్యానించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఆయా సంస్థలతో కేసులు నమోదు చేస్తూ భయపెడుతోందని కేజ్రీవాల్ అన్నారు.

San Francisco: మనుషుల్ని చంపేందుకు రోబోలు.. అమెరికా పోలీసుల ప్రతిపాదన

ఢిల్లీలో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందించారు. ‘‘ఏడేళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై బీజేపీ 167 కేసులు నమోదు చేసింది. అయితే, వాటిలో ఒక్కటి కూడా దర్యాప్తు సంస్థలు నిరూపించలేకపోయాయి. వాటిలో 150 కేసు విచారణలు పూర్తయ్యాయి. మిగతావి విచారణ జరుగుతున్నాయి. ఆప్ నేతలపై తప్పులు కనిపెట్టేందుకు 800 మంది సిబ్బంది పని చేస్తున్నారు. అయితే, వాళ్లేమీ సాధించలేకపోయారు. మా మీద తప్పుడు కేసులు పెట్టడం ద్వారా అధికారులు కోర్టులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఒక్క రోజు సీబీఐ, ఈడీని నా చేతికి ఇచ్చి చూడండి. సగం మంది బీజేపీ నేతలు జైల్లోనే ఉంటారు. రాబోయే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ అత్యధిక మెజారిటీతో గెలవబోతుంది. 250 సీట్లకుగాను, ఆప్ 230 సీట్లు గెలుచుకుంటుంది. బీజేపీకి 20 కంటే తక్కువ సీట్లే వస్తాయి. గుజరాత్‌లో కూడా మా పార్టీ గెలిచే అవకాశం ఉంది’’ అని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.