Ukraine: యుద్ధం కొన‌సాగిన‌న్ని రోజులు ఉక్రెయిన్‌కు సాయం చేస్తూనే ఉంటాం: బైడెన్

భారీ ఆయుధ సంప‌త్తి ఉన్న‌ రష్యాని చిన్న దేశం ఉక్రెయిన్ కొన్ని నెల‌లుగా నిలువ‌రిస్తుండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. అమెరికా స‌హా ప‌లు దేశాల సాయంతో ర‌ష్యాను ఉక్రెయిన్ నిలువ‌రించ‌గ‌లుగుతోంది.

Ukraine: యుద్ధం కొన‌సాగిన‌న్ని రోజులు ఉక్రెయిన్‌కు సాయం చేస్తూనే ఉంటాం: బైడెన్

Russia Ukraine War Joe Biden Announces Closing Off American Airspace To All Russian Flights

Ukraine: భారీ ఆయుధ సంప‌త్తి ఉన్న‌ రష్యాని చిన్న దేశం ఉక్రెయిన్ కొన్ని నెల‌లుగా నిలువ‌రిస్తుండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. అమెరికా స‌హా ప‌లు దేశాల సాయంతో ర‌ష్యాను ఉక్రెయిన్ నిలువ‌రించ‌గ‌లుగుతోంది. అయితే, ఉక్రెయిన్‌కు ఆయా దేశాలు ఇంకా ఎన్నాళ్ళు ఆయుధ‌, సాంకేతిక‌ సాయం చేస్తాయ‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనిపై అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ స్పందిస్తూ స్ప‌ష్ట‌తనిచ్చారు.

Maharashtra: మ‌హారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్ర‌మాణం.. డిప్యూటీ సీఎంగా ఫ‌డ్న‌వీస్

యుద్ధం ఎంత కాలం జ‌రిగితే అంత కాలం ర‌ష్యా దాడుల‌ను తిప్పికొట్టేందుకు అమెరికాతో పాటు త‌మ మిత్ర‌దేశాలు ఉక్రెయిన్‌కు సాయం చేస్తూనే ఉంటాయ‌ని బైడెన్ చెప్పారు. ఉక్రెయిన్‌కు త‌మ మ‌ద్ద‌తు కొన‌సాగుతూనే ఉంటుంద‌ని తెలిపారు. ఇప్ప‌టికే ర‌ష్యా నుంచి ఉక్రెయిన్ భారీ దాడుల‌ను తిప్పికొట్టింద‌ని ఆయ‌న చెప్పారు. ఆ యుద్ధం ఇంకా ఎన్నాళ్ళు కొన‌సాగుతుందో చెప్ప‌లేన‌ని అన్నారు. అయితే, ర‌ష్యా చేతిలో ఉక్రెయిన్ ఓడిపోద‌ని చెప్పారు.