Gold Rate: పెరిగిన‌ బంగారం, వెండి ధ‌ర‌లు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఇవాళ‌ 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.255 పెరిగి, రూ.51,783కు చేరింది. ఇంత‌కు ముందు 10 గ్రాముల‌ ప‌సిడి ధ‌ర రూ.51,528గా ఉంది. అలాగే, దేశంలో వెండి ధ‌ర‌లు కూడా పెరిగాయి. కిలో వెండి ధ‌ర రూ.1,610 పెరిగి రూ.58,387కి చేరింది. ఇంత‌కు ముందు కిలో వెండి ధ‌ర రూ.56,777గా ఉంది.

Gold Rate: పెరిగిన‌ బంగారం, వెండి ధ‌ర‌లు

Gold Price

Gold Rate: దేశంలో బంగారం ధ‌ర‌లు మ‌ళ్ళీ పెరిగాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఇవాళ‌ 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.255 పెరిగి, రూ.51,783కు చేరింది. ఇంత‌కు ముందు 10 గ్రాముల‌ ప‌సిడి ధ‌ర రూ.51,528గా ఉంది. అలాగే, దేశంలో వెండి ధ‌ర‌లు కూడా పెరిగాయి. కిలో వెండి ధ‌ర రూ.1,610 పెరిగి రూ.58,387కి చేరింది. ఇంత‌కు ముందు కిలో వెండి ధ‌ర రూ.56,777గా ఉంది.

అంత‌ర్జాతీయ మార్కెట్‌లోనూ ప‌సిడి, వెండి ధ‌ర‌లు పెరిగాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (28.349 గ్రాములు) బంగారం ధ‌ర 1,762 అమెరికన్‌ డాల‌ర్ల‌ (రూ.1,39,810.30)కు చేరింది. అలాగే, వెండి ధ‌ర ఔన్సుకు 20.10 అమెరిక‌న్ డాల‌ర్ల (రూ.1,595.17)కు పెరిగింది. అమెరికా డాలర్ విలువ రోజురోజుకీ పెరిగిపోతూ బంగారం, వెండి ధ‌ర‌ల‌పై ప్ర‌భావం చూపుతుండడంతో ఇటీవల వాటి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పడిపోతూ వచ్చిన విషయం తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి.

CM KCR: అఖిలేశ్ యాద‌వ్‌తో సీఎం కేసీఆర్ స‌మావేశం