Gold Price : తెలుగు రాష్ట్రాల్లో వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు

కరోనా సమయంలో బంగారం రేట్లు ఆకాశమే హద్దుగా పెరిగాయి. గతేడాది చివర్లో తులం బంగారం ఏకంగా రూ.50 వేలు దాటింది. అనంతరం ఏర్పడిన పరిస్థితుల వల్ల బంగారం ధరలు మారాయి. ఇక తాజాగా వరుసగా రెండు రోజు బంగారం ధర తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ధర స్వల్పంగా ధర తగ్గింది. దేశరాజధాని ఢిల్లీలో బంగారం ధర పెరిగింది.

Gold Price : తెలుగు రాష్ట్రాల్లో వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు

Gold Price (4)

Gold Price :  కరోనా సమయంలో బంగారం రేట్లు ఆకాశమే హద్దుగా పెరిగాయి. గతేడాది చివర్లో తులం బంగారం ఏకంగా రూ.50 వేలు దాటింది. అనంతరం ఏర్పడిన పరిస్థితుల వల్ల బంగారం ధరలు మారాయి. ఇక తాజాగా వరుసగా రెండు రోజు బంగారం ధర తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ధర స్వల్పంగా ధర తగ్గింది. దేశరాజధాని ఢిల్లీలో బంగారం ధర పెరిగింది.

ఇక బంగారం ధరల పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బిట్ కాయిన్ కారణంగా బంగారం రేటు పెరగొచ్చని తెలిపారు. బిట్‌కాయిన్ విలువ అడ్డంగా పడిపోయింది. గత నెలలో ఈ క్రిప్టోకరెన్సీ విలువ 40 శాతం తగ్గింది. ఫలితంగా ఇప్పుడీ కాయిన్ విలువ రూ.23,72,421 ఉంది. దీంతో పెట్టుబడులు పెట్టేవారు బంగారం, స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందువల్ల స్టాక్ మార్కెట్లు జోరందుకుంటున్నాయి. ఇక బంగారం ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బంగారం నగల కొనుగోళ్లు కూడా పెరిగాయి కాబట్టి… డిమాండ్ సప్లై సూత్రం ప్రకారం కూడా ధరలు పెరగొచ్చు అంటున్నారు.

 

ఇక వివిధ ప్రాంతాల్లో ఉన్న బంగారం ధరలను ఓ సారి పరిశీలిద్దాం.

* ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,400 కాగా, 24 క్యారెట్లు ధర రూ. 51,700 వద్ద కొనసాగుతోంది.
* ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 47,190 గా నమోదుకాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,190 గా ఉంది.
* చెన్నైలో 10 గ్రాములు 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,410 గా నమోదుకాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 49,540 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 44,900గా నమోదుకాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,000 వద్ద కొనసాగుతోంది.
* హైదరాబాద్‌లో సోమవారం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 44,990 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 49,000 వద్ద కొనసాగుతోంది.
ఇక ఆంధ్ర ప్రదేశ్..
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 44,990 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,000 గా ఉంది.
* విశాఖలో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 44,900 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 49,000 గా నమోదైంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే..

ఈ ఉదయానికి వెండి ధర 1 గ్రాము రూ.73.20 ఉంది.10 గ్రాముల ధర రూ.732 ఉంది. 100 గ్రాములు ధర రూ.7,320 ఉండగా… కేజీ వెండి ధర… రూ.74,200 ఉంది. నిన్న కేజీ వెండి ధరలో మార్పు లేదు. జూన్‌లో వెండి ధర కేజీకి రూ.3,900 పెరిగింది. జూన్ 30 నాటికి వెండి ధర రూ.76,800 ఉంది. జులై 1 నుంచి వేడి ధర క్రమంగా తగ్గుతూ.. పెరుగుతూ వస్తుంది.