భారీగా తగ్గిన బంగారం ధరలు.. కొనుక్కోవాలంటే ఇదే కరెక్ట్ టైమ్!

భారీగా తగ్గిన బంగారం ధరలు.. కొనుక్కోవాలంటే ఇదే కరెక్ట్ టైమ్!

gold-rate

బంగారం ధరలు నిరంతరం తగ్గిపోతూ ఉన్నాయి. బంగారం కొనేందుకు రెడీ అవుతుంటే మాత్రం ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు నిపుణులు. పసిడి రేటు ఈ ఏడాది మొదలైనప్పటి నుంచే తగ్గుతూ వస్తుండగా.. ఇప్పుడు భారీగా పతనం అయ్యింది. ఇంకా రేట్లు తగ్గొచ్చని కొంత మంది భావిస్తుంటే.. మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నాయి మార్కెట్ వర్గాలు.

బంగారం ధర 2020 ఆగస్ట్ నెలలో ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకోగా.. ఆల్‌టైమ్ గరిష్ట స్థాయితో చూసుకుంటే మొత్తం.. పసిడి రేటు రూ.11,500 తగ్గిపోయింది. బిట్ కాయిన్, స్టాక్స్, బాండ్స్ వంటి వాటికి ఇన్వెస్టర్లు ప్రాధాన్యం ఇవ్వడంతో బంగారం రేట్లు పతనం అయ్యినట్లుగా భావిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం రేట్లు.. రూ. 5వేలు వరకు తగ్గగా.. రానున్న రోజుల్లో ఇంకా పడిపోతుందా? లేదంటే పైకి కదులుతుందా? అనే అంశం ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

బంగారం ధర మళ్లీ పైకి చేరొచ్చని నిపుణులు చెబుతుండగా.. సమీప కాలంలో రూ.1000 పెరగొచ్చని అంటున్నారు. బంగారం ధర రానున్న రోజుల్లో రూ.41 వేల స్థాయికి పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. బంగారం ధర పెరగడం స్టార్ట్ అయితే మళ్లీ రూ.63 వేలకు చేరే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భారతదేశ బంగారు మార్కెట్లో ధర 44 వేల స్థాయిని తాకగా.. రాబోయే సమయంలో దాని ధర మరింత తగ్గుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. గతేడాది భారత మార్కెట్లో బంగారం ధర పది గ్రాములు 56 వేల రికార్డుకు చేరుకుంది. అయితే స్పాట్ డిమాండ్ బలహీనంగా ఉన్నందున, వ్యాపారులు తమ ఒప్పందాలను తగ్గించుకున్నారు, ఈ కారణంగా ఫ్యూచర్స్ ట్రేడ్‌లో బంగారం 0.31 శాతం తగ్గి 10 గ్రాములకు 44,544 రూపాయలకు చేరుకుంది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ఏప్రిల్‌లో డెలివరీ చేసిన బంగారు ఫ్యూచర్ల ధర రూ .139 అంటే 0.31 శాతం తగ్గి 10 గ్రాములకు రూ .44,544 కు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో, న్యూయార్క్ బంగారం 0.09 శాతం తగ్గి ఔన్సు 1,697.00 డాలర్లకు చేరుకుంది.