తగ్గిన బంగారం ధర…..పెరిగిన వెండి ధర

తగ్గిన బంగారం ధర…..పెరిగిన వెండి ధర

gold-rate-silver-rate

gold rate decreased, silver rate increase today : ‌దేశంలో బంగారం ధ‌ర భారీగా త‌గ్గింది. రాజ‌ధాని ఢిల్లీలో 10 గ్రాముల 99.9 స్వ‌చ్ఛ‌త క‌లిగిన బంగారం ధ‌ర రూ.1,324 త‌గ్గి రూ.47,520కి చేరింది. క్రితం ట్రేడ్‌లో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.48,844 వ‌ద్ద ముగిసింది. కేంద్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్‌లో బంగారం, వెండి దిగుమ‌తుల‌పై దిగుమ‌తి సుంకాన్ని త‌గ్గించింద‌ని, ఇవాళ్టి ట్రేడింగ్‌లో బంగారం ధ‌ర భారీగా త‌గ్గ‌డానికి అది కూడా ఒక కార‌ణ‌మ‌ని నిపుణులు తెలిపారు.

కాగా …..బంగారం ధ‌ర త‌గ్గినా దేశంలో ఇవాళ్టి ట్రేడింగ్‌లో వెండి ధ‌ర మాత్రం భారీగా పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి ధ‌ర రూ.3,461 పెరిగి రూ.72,470కి చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధ‌ర రూ.69,009 వ‌ద్ద ముగిసింది. కాగా, అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఇవాళ ఔన్స్ బంగారం ధ‌ర 1,871 అమెరిక‌న్ డాల‌ర్‌లు, ఔన్స్ వెండి ధ‌ర రూ.29.88 అమెరిక‌న్ డాల‌ర్‌లు ప‌లికింది.