15 Lakh Prize : మంచి పేరు, ట్యాగ్ లైన్, లోగో తయారీకి….15లక్షల బహుమతి..ఎవరిస్తారంటే..

15 Lakh Prize : మంచి పేరు, ట్యాగ్ లైన్, లోగో తయారీకి….15లక్షల బహుమతి..ఎవరిస్తారంటే..

Dfi

15 Lakh Prize : క్రీడాపోటీలో, క్విజ్ పోటీలో, పాటల పోటీలో ఇప్పటివరకు చూసుంటాం..ఆ పోటీలలో నెగ్గిన వారికి మెమాంటోలతోపాటు, కొంత ఫ్రైజ్ మనీ కూడా ఇస్తారు. చాలా మంది ఫ్రైజ్ మనీ వస్తుందనగానే ఆసక్తిగా పోటీల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. అయితే ప్రస్తుతం కేంద్రప్రభుత్వం ఈ తరహా పోటీనే నిర్శహించబోతుంది. ఈ పోటీలో గెలిచిన వారికి భారీ బహుమతులను ఇస్తామని కూడా ప్రకటించింది. ఇంతకీ దీనికి సంబంధించిన వివరాలేంటంటే..

ఇటీవల కేంద్ర ప్రభుత్వం మౌళిక సదుపాయాల కల్పన కోసం డెవలప్ మెంట్ ఫైనాన్షియల్ ఇన్సిట్టిట్యూషన్ కి ఆమోదం తెలిపింది. కొత్త సంస్ధ ఆవిర్భావం కావటంతో దానికి సంబంధించిన పేరు, ట్యాగ్ లైన్, లోగోను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ సంస్ధ అసలు లక్ష్యాన్ని సూచించేలా పేరు, ట్యాగ్ లైన్, లోగోను డిజైన్ కోసం కేంద్ర ఆర్ధిక శాఖ పోటీలను నిర్వహించనుంది. ఆగస్టు 15వ తేదిలోగా వీటికి రూపకల్పన చేసి అందించాలని కోరింది.

వచ్చిన ఎంట్రీలన్నింటిని పరిశీలించి వాటిలో బాగా ఉన్న వాటిని ఎంపిక చేస్తారు. ఎంపికైన వాటిలో ఒక్కో విభాగంలో మొదటి స్ధానంలో నిచినవారికి 5లక్షలు చొప్పున మొత్తం 15లక్షలు బహుమతిగా అందిస్తారు. రెండోస్ధానంలో నిలిచిన వారికి 3లక్షలు, మూడో స్ధానంలో నిలిచన వారికి 2లక్షల రూపాయలను బహుమతిగా అందజేస్తారు.

డీఎఫ్ఐ కి సంబంధించిన పేరు, ట్యాగ్ లైన్ , లోగో డిజైన్ కు సంబంధించి కొన్ని నియమాలు కూడా పాటించాలని కేంద్రం సూచించింది. తయారు చేసే వాటిలో దేశ సంస్కృతి ప్రతిబింబించటంతోపాటు, ప్రజలందరికి అర్ధమయ్యేలా, పలకటానికి వీలుగా ఉండాలని చెప్పింది. డిజైన్లు పూర్తయిన వెంటనే ఆగస్టు 15వతేది సాయంత్ర 5.30 సమయానికి ఆర్ధికశాఖ వెబ్ సైట్ ద్వారా కేంద్రానికి ఎంట్రీలను పంపాలని కోరింది.