Pushpa OTT: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’. బన్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసిన ఈ సినిమా

Pushpa OTT: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

Pushpa Ott

Pushpa OTT: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’. బన్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసిన ఈ సినిమా.. బన్నీ వన్ మ్యాన్ షోగా నిలిచి 17 రోజులుగా స్టడీ వసూళ్లతో రికార్డుల దిశగా వెళ్తుంది. ముఖ్యంగా ఉత్తరాదిన ఈ సినిమాకి అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతుండడంతో భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తుంది. ఇకముందు ఇప్పట్లో భారీ సినిమాలు లేకపోవడం కూడా ఈ సినిమాకు ఇంకా కలిసి వచ్చే అవకాశం ఉంది.

Bigg Boss OTT Telugu: ఓటీటీ తెలుగు సీజన్ మొదలయ్యేది ఎప్పుడంటే?

కాగా, ఈ మధ్య కాలంలో నిండా నెల తిరిగే సమయానికే నిర్మాతలు డిజిటల్ రిలీజ్ కూడా చేసేసి భారీ బిజినెస్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. బన్నీ పుష్ప సినిమా ఓటీటీ బిజినెస్ కూడా భారీ ధరకే జరిగినట్టు తెలుస్తుంది. పుష్ప డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ భారీ ధరకి దక్కించుకున్న సంగతి తెలిసిందే. సహజంగా స్టార్ హీరోల సినిమాలు దాదాపుగా విడుదలైన నెల రోజుల తర్వాతనే ఓటీటీలో విడుదల చేస్తారు. అలా అనుకుంటే పుష్పను జనవరి 17 తర్వాతే స్ట్రీమింగ్ చేసే వీలుంటుంది.

Alia Bhatt: ఫాఫమ్ అలియా.. పగలబడి నవ్వినా తప్పేనా?!

అయితే.. అతి త్వరలోనే పుష్ప సినిమా ఓటీటీలో విడుదల కానుందనే వార్తలొస్తున్నాయి. లేటెస్ట్‌ సమాచారం ప్రకారం.. జనవరి 7న ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుందట. అదే రోజు విడుదల కావాల్సిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ డేట్‌ను క్యాష్‌ చేసుకోవడంతో పాటు సంక్రాంతి బిగ్ ఫెస్టివల్ ను కూడా క్యాష్ చేసుకోవచ్చని ప్లాన్ గా తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుంది.