బడ్జెట్ 2021-22.. రేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త

బడ్జెట్ 2021-22.. రేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త

good news for ration card holders: యావత్ దేశం ఎంతో ఆసక్తి కనబరుస్తున్న అంశం బడ్జెట్(Union Budget 2021). అందరి కళ్లు బడ్జెట్ పైనే. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు(ఫిబ్రవరి 1,2021) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ సమావేశం ప్రారంభం కాగానే విపక్షాలు సభలో నిరసనకు దిగాయి. స్పీకర్‌ ఓం బిర్లా వారించినప్పటికీ సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. వారి నినాదాల నడుమే నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం మొదలుపెట్టారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా మూడోసారి. కాగా, దేశ చరిత్రలో తొలిసారిగా పేపర్ లెస్(డిజిటల్) బడ్జెట్ ను సమర్పించారు. ట్యాబ్‌లో చూసి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు.

అన్ని ప్రాంతాల్లో వన్ నేషన్-వన్ రేషన్ అమలు:
బడ్జెట్ లో రేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వన్ నేషన్-వన్ రేషన్ విధానం ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని అన్ని ప్రాంతాల్లో పూర్తి స్తాయిలో అమలు చేయనున్నారు. వలస కార్మికులు దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం రేషన్‌ తీసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వన్ నేషన్-వన్ రేషన్ విధానం విజయవంతంగా అమలవుతోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

రైతుల సంక్షేమం:

* రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

* రైతుల ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల ఉంది

* వ్యవసాయ సంస్కరణలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది

* వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయింపు

* 2021-22లో ఆహార ఉత్పత్తుల సేకరణ

* కనీస మద్దతు ధరకు రూ.లక్షా 72వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా

* 2020-21లో రైతులకు రూ.75వేల కోట్లు కేటాయించాం

* తద్వారా 1.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు

* రైతు రుణాల లక్ష్యం రూ.16.5 లక్షల కోట్లు

* 2022లో అగ్రి క్రెడిట్ లక్ష్యం రూ. 16.5 లక్షల కోట్లు

* 5 మేజర్ ఫిషింగ్ హబ్స్ ఏర్పాటు

* 15వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం కేంద్ర పథకాల హేతుబద్ధీకరణ.