Cyber crime: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర వినియోగదారుల కమిషన్ కీలక ఆదేశాలు

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా కొద్దీ సైబర్ నేరాలు అదేస్థాయిలో పెరిగిపోతున్నాయి. రాత్రికి రాత్రే అకౌంట్లలో డబ్బులు మాయం కావడం వంటి కేసులు మనం చూస్తూనే ఉన్నాం. వాటి రికవరీకి బ్యాంకులు చేతులెత్తేస్తున్నాయి ..

Cyber crime: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర వినియోగదారుల కమిషన్ కీలక ఆదేశాలు

State Consumer Commission

Cyber crime: టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా కొద్దీ సైబర్ నేరాలు అదేస్థాయిలో పెరిగిపోతున్నాయి. రాత్రికి రాత్రే అకౌంట్లలో డబ్బులు మాయం కావడం వంటి కేసులు మనం చూస్తూనే ఉన్నాం. వాటి రికవరీకి బ్యాంకులు చేతులెత్తేస్తున్నాయి.. పోలీసులే చూసుకోవాలంటూ తప్పుకుంటున్నాయి. 2013లో తన ప్రమేయం లేకుండా ఎస్‌బీఐ ఖాతాదారుడి ఖాతాలో నుంచి 1.46 లక్షలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. దీనిపై బ్యాంకుతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో బాధితుడు జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. బాధితుడి అపీల్ పై విచారణ చేపట్టిన రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఎస్ బీఐకి కీలక ఆదేశాలు జారీ చేసింది.

SBI Theft: ఎస్బీఐ లాకరు నుంచి 2.8కేజీల బంగారం దొంగతనం

2013 సంవత్సరంలో చర్లపల్లికి చెందిన ఎం.కె. మిశ్ర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.3లక్షలు వ్యక్తిగత రుణం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని డ్రా చేసుకునేలోగా ఆయన డెబిట్ కార్డు ఆధారంగా సైబర్ నేరగాళ్లు రూ.1.46 లక్షలు కాజేశారు. ఒక్కసారిగా కంగుతిన్న మిశ్ర.. విషయాన్ని స్థానిక ఎస్బీఐ సిబ్బందికి తెలిపారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉపయోగం లేకుడా పోయింది. బ్యాంకు సిబ్బంది తీరుపై విసుగు చెందిన మిశ్ర తనకు జరిగిన అన్యాయంపై జిల్లా వియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. బాధితుడికి తీర్పు అనుకూలంగా వచ్చింది. అయితే ఎస్ బిఐ జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. తాజాగా కమిషన్ కీలక తీర్పును వెలువరించింది.

Sbi Bank: 31పైసల రుణం చెల్లించలేదని రైతు పట్ల బ్యాంకు సిబ్బంది వింతప్రవర్తన.. హైకోర్టు ఏం చేసిందంటే..

ఎస్‌బీఐ అప్పీలు పై విచారణ చేపట్టిన కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎమ్మెస్కే జైశ్వాల్, సభ్యులు మీనా రామనాథన్, కె. రంగారావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పును వెలువరించింది. ఖాతాదారు మోసపోయిన రూ.1.46 లక్షలను 2013 నుంచి 9శాతం వడ్డీతో చెల్లించాలంటూ జిల్లా ఫోరం ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఎస్‌బీఐ అప్పీలును కొట్టేసింది. సైబర్ నేరగాళ్లు కొట్టేసిన సొమ్మును తన ఖాతాదారులకు ఎస్‌బీఐ చెల్లించాల్సిందేనంటూ తీర్పులో పేర్కొంది.