Google Assistant : గూగుల్ అసిస్టెంట్‌లో కొత్త ఫీచర్.. పాడ్‌క్యాస్ట్ కొత్త వాయిస్ కమాండ్.. లేటెస్ట్ ఎపిసోడ్ నేరుగా ప్లే చేయొచ్చు..!

Google Assistant : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అసిస్టెంట్ (Google Assistant)లో కొత్త ఫీచర్ వచ్చేసింది. అమెరికన్ బ్రౌజర్ గూగుల్ అసిస్టెంట్‌కి కొత్త వాయిస్ కమాండ్‌లను యాడ్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వర్చువల్ అసిస్టెంట్, అసిస్టెంట్ సర్వీసులను మెరుగుపర్చేందుకు సాయపడుతుంది.

Google Assistant : గూగుల్ అసిస్టెంట్‌లో కొత్త ఫీచర్.. పాడ్‌క్యాస్ట్ కొత్త వాయిస్ కమాండ్.. లేటెస్ట్ ఎపిసోడ్ నేరుగా ప్లే చేయొచ్చు..!

Google Assistant gets new feature on podcasts All details

Google Assistant : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అసిస్టెంట్ (Google Assistant)లో కొత్త ఫీచర్ వచ్చేసింది. అమెరికన్ బ్రౌజర్ గూగుల్ అసిస్టెంట్‌కి కొత్త వాయిస్ కమాండ్‌లను యాడ్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వర్చువల్ అసిస్టెంట్, అసిస్టెంట్ సర్వీసులను మెరుగుపర్చేందుకు సాయపడుతుంది. పాడ్‌కాస్ట్ నిర్దిష్ట ఎపిసోడ్‌ను సెర్చ్ చేయడానికి, ప్లే చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. ఇంతకుముందు, Google అసిస్టెంట్ పాడ్‌క్యాస్ట్ లేటెస్ట్ ఎపిసోడ్‌ను నేరుగా ప్లే చేయవచ్చు. ఇప్పుడు, పోడ్‌కాస్ట్ సంబంధిత సర్వీసులను మెరుగుపర్చేందుకు కొత్త కమాండ్స్ మూడు ఫిల్టర్‌లతో ఉపయోగించవచ్చు.

Google Assistant gets new feature on podcasts All details

Google Assistant gets new feature on podcasts All details

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. యూజర్లు ఎపిసోడ్ పేరును సెర్చ్ చేసేందుకు Google అసిస్టెంట్‌ని ఉపయోగించవచ్చు. తద్వారా మీరు వినాలనుకునే పాడ్‌క్యాస్ట్‌ల నిర్దిష్ట ఎపిసోడ్‌లకు యాక్సెస్‌ను పొందవచ్చు. Google లేటెస్ట్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. ఇప్పటి వరకు యూజర్లు ‘Ok Google, XYZ Play’ అని చెప్పడం ద్వారా పాడ్‌క్యాస్ట్ లేటెస్ట్ ఎపిసోడ్‌ను మాత్రమే ప్లే చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్ ఇప్పుడు యూజర్లు మూడు కొత్త ఫిల్టర్‌లతో నిర్దిష్ట ఎపిసోడ్‌లోకి వెళ్లేందుకు సాయం చేస్తుంది. గెస్ట్‌లను ఉపయోగించి సెర్చ్ చేయవచ్చు. మీకు నచ్చిన టాపిక్ ద్వారా నేరుగా ఎపిసోడ్ సెర్చ్ చేయవచ్చు.

Google Assistant gets new feature on podcasts All details

Google Assistant gets new feature on podcasts All details

ఇదిలా ఉండగా, కంపెనీ UPI AutoPayను ప్రవేశపెడుతున్నట్లు Google ఇటీవల ప్రకటించింది. భారత్‌లో Google Playలో సబ్‌స్క్రిప్షన్ ఆధారిత కొనుగోళ్లకు పేమెంట్ మెథడ్‌గా NPCI UPI 2.0 కింద ఆటోపేను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌కు సపోర్టు ఇచ్చే ఏదైనా UPI యాప్‌ని ఉపయోగించి పేమెంట్స్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. UPI ఆటోపే ఫీచర్ సబ్‌స్క్రిప్షన్‌లను సెటప్ చేయడంలో సాయపడుతుంది. యూజర్లు తమ కొనుగోలు కోసం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ని ఎంచుకున్న తర్వాత కార్ట్‌లోని పేమెంట్ మెథడ్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. వారు ‘Pay with UPI’ని ఎంచుకోవాలి. మీ సపోర్టు ఉన్న UPI అప్లికేషన్‌లో కొనుగోలు చేయాలి.

భారత్, వియత్నాం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కోసం Google Play రిటైల్, పేమెంట్ యాక్టివేషన్ హెడ్ సౌరభ్ అగర్వాల్ మాట్లాడుతూ.. యూజర్లు యాప్‌లు, ఇన్-యాప్ కంటెంట్ కోసం పేమెంట్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పేమెంట్ విధానాలను యాడ్ చేసేందుకు చూడవచ్చు. ప్లాట్‌ఫారమ్‌లో UPI ఆటోపే కాంటాక్టుతో కంపెనీ UPI సౌలభ్యాన్ని సబ్‌స్క్రిప్షన్-ఆధారిత కొనుగోళ్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. Google Play లో స్థానిక డెవలపర్‌లు తమ సబ్‌స్క్రిప్షన్ ఆధారిత కార్యకలాపాలను విస్తరించుకోవచ్చు. అనేక మంది యూజర్లు, గూగుల్ అసిస్టెంట్ సర్వీసులను యాక్సెస్ చేసేందుకు అనుమతినిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Vivo X90 Series : వివో నుంచి X90 సిరీస్ వస్తోంది.. గ్లోబల్ లాంచ్‌కు ముందే స్పెషిఫికేషన్లు లీక్..!