Happy Fathers Day : గూగుల్ ఫాదర్స్ డే విషెస్

ప్రపంచంలోని నాన్నలందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు సోషల్ మీడియాలో కీలకంగా ఉన్న గూగుల్ వెల్లడించింది. ఫాదర్స్ డే సందర్భంగా యానిమేటెడ్ డూడుల్ తో సత్కరించింది. ప్రతొక్కరికీ ఫాదర్స్ డే విషెస్ తెలియచేస్తున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఫాదర్స్ డేను జూన్ మూడో ఆదివారం జరుపుకుంటారు.

Happy Fathers Day : గూగుల్ ఫాదర్స్ డే విషెస్

Google

Google Doodle : ప్రపంచంలోని నాన్నలందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు సోషల్ మీడియాలో కీలకంగా ఉన్న గూగుల్ వెల్లడించింది. ఫాదర్స్ డే సందర్భంగా యానిమేటెడ్ డూడుల్ తో సత్కరించింది. ప్రతొక్కరికీ ఫాదర్స్ డే విషెస్ తెలియచేస్తున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఫాదర్స్ డేను జూన్ మూడో ఆదివారం జరుపుకుంటారు.

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఫాదర్స్ డేను జరుపుకుంటుంటారు. మరికొన్ని దేశాల్లో ఈ తేదీల్లో మార్పు ఉంటుంది. పోర్చుగల్, స్పెయిన్, క్రొయేషియా, ఇటలీ వంటి కాథలిక్ యూరోపియన్ దేశాలు మార్చి 19వ తేదీన నిర్వహించుకుంటుంటాయి. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ లు నవంబర్ రెండో ఆదివారం జరుపుకుంటాయి. రష్యా దేశం ఫిబ్రవరి 23వ తేదీన ఫాదర్స్ డే నిర్వహించుకుంటుంటారు. 1910 జూన్ మూడో ఆదివారం వాషింగ్టన్ వైఎంసీలో స్పోకెన్ లో సోనోరా స్మార్ట్ డాడ్ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నట్లు చెబుతుంటారు.

నాన్న..వీరి త్యాగాలను గుర్తించుకోవడానికి ఓ రోజు కేటాయించబడింది. ప్రతి సంవత్సరం మాతృ దినోత్సవం జరుపుకున్నట్లే…ఫాదర్స్ డేను నిర్వహించుకుంటుంటారు. జూన్ నెల మూడో ఆదివారం సెలబ్రేట్ చేసుకుంటారు. తండ్రి కష్టాలను, బాధలను, భాధ్యతలను చూసిన సోనోరా ఫాదర్స్ డే ఉండాలని అనుకున్నారని, తండ్రి పుట్టిన రోజు అయిన..జూన్ 05వ తేదీన ఫాదర్స్ డే సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నట్లు చర్చ్ పాస్టర్ తో చెప్పారంట. అయితే..కొన్ని కారణాల వల్ల..ఆ రోజు కాకుండా..జూన్ మూడో ఆదివారానికి వాయిదా పడింది. ఇలా..ప్రతి సంవత్సరం జూన్ 03వ తేదీన ఆదివారం ఫాదర్స్ డే జరుపుకొనే సంప్రదాయం అమెరికాలో మొదలైంది. అనంతరం ఇతర దేశాల్లోనూ దీనిని నిర్వహించుకుంటుంటారు.