Google Surprise to RRR : RRR కోసం గూగుల్ స్పెషల్ సర్ప్రైజ్.. గూగుల్ లో RRR అని వెతికి చూడండి..
తాజాగా ఆర్ఆర్ఆర్ క్రేజ్ కి మరో స్పెషల్ గుర్తింపు వచ్చింది. గూగుల్ కంపెనీ RRR టీంకి సూపర్ సర్ప్రైజ్ ఇచ్చింది. మనకి దేని గురించి కావాలన్నా గూగుల్ లోనే వెతుకుతాం. అలాగే ఆర్ఆర్ఆర్ గురించి కూడా కొన్ని కోట్ల మంది.............
Google Surprise to RRR : ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలని పెట్టి భారీ మల్టీస్టారర్ గా RRR సినిమాని తెరకెక్కించారు రాజమౌళి. మార్చ్ లో రిలీజైన ఈ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టింది. అంతే కాక ప్రపంచం నలుమూలల RRR సినిమా మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమాని అన్ని దేశాల ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు, హాలీవుడ్ టెక్నీషియన్స్ సైతం అభినందిస్తున్నారు.
తాజాగా ఆర్ఆర్ఆర్ క్రేజ్ కి మరో స్పెషల్ గుర్తింపు వచ్చింది. గూగుల్ కంపెనీ RRR టీంకి సూపర్ సర్ప్రైజ్ ఇచ్చింది. మనకి దేని గురించి కావాలన్నా గూగుల్ లోనే వెతుకుతాం. అలాగే ఆర్ఆర్ఆర్ గురించి కూడా కొన్ని కోట్ల మంది గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఇక RRR సినిమా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయినా సంగతి తెలిసిందే. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ గురించి గూగుల్ లో సెర్చ్ చేసే వారికి ఒక సర్ప్రైజ్ కనిపించేలా చేసింది గూగుల్. RRR అని గూగుల్‌లో టైప్ చేసి ఎంటర్ కొట్టగానే సెర్చ్ బార్ కింద ఒక బైక్, గుర్రం వెళ్తూ కనిపిస్తాయి. ఒకసారి బైక్ ముందు వస్తే, మరోసారి గుర్రం ముందు వస్తుంది.
RRR సినిమాలో తారక్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడపగా, రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేసిన సంగతి తెలిసిందే. గుర్రంపై, బైక్ పై వారిద్దరి సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ సర్ప్రైజ్ చూసి RRR చిత్ర యూనిట్ తో పాటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సర్ప్రైజ్ ఇచ్చినందుకు గూగుల్‌కు ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలుపుతూ స్పెషల్ పోస్ట్ చేసింది. గుర్రం, బైక్ వెళ్తున్న దాన్ని వీడియోగా తీసి షేర్ చేసి.. ”మమ్మల్ని సర్ప్రైజ్ చేసినందుకు, ప్రపంచవ్యాప్తంగా RRRకు ఉన్న పాపులారిటీని గుర్తించినందుకు థ్యాంక్యూ గూగుల్” అని పోస్ట్ చేసింది.