Google Video: స్వాతంత్రానంతరం 75ఏళ్లలో భారత్ వృద్ధిని రెండు నిమిషాల వీడియో రూపొందించిన గూగుల్.. మీరూ చూడండి

భారత్ కు స్వాతంత్రం వచ్చి 75ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ఆగస్టు 15 ను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

Google Video: స్వాతంత్రానంతరం 75ఏళ్లలో భారత్ వృద్ధిని రెండు నిమిషాల వీడియో రూపొందించిన గూగుల్.. మీరూ చూడండి

Google video

Google Video: భారత్ కు స్వాతంత్రం వచ్చి 75ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ఆగస్టు 15 ను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన ప్రముఖులను, స్వాతంత్రానంతరం 75ఏళ్లలో భారత్ ఎదుగుదలను గుర్తుచేసుకుంటూ దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్వాతంత్రంకు ముందు, స్వాతంత్రానంతరం 75ఏళ్లలో భారత్ ప్రపంచ దేశాలకు దీటుగా ఎదిగిన తీరును కొన్ని ముఖ్య ఘట్టాల ద్వారా వివరిస్తూ గూగుల్ రెండు నిమిషాల వీడియోను రూపొందించింది.

75th Independence Day: 1 నుంచి 101 వ‌ర‌కు అద్భుతమైన జ‌ర్నీ.. కామ‌న్వెల్త్ గేమ్స్‌లో భార‌త్ ప్ర‌స్థానం..

రాజ్యాంగం రూపొందించుకోవటం, తొలిసారి ఎన్నికలు నిర్వహించుకోవటం వంటి ముఖ్య ఘట్టాలను వివరిస్తూ గూగుల్ ఈ వీడియోను రూపొందించింది. బ్రిటీష్ వారిని దేశం నుంచి తరిమేసిన తరువాత భారత్ అంచెలంచెలుగా ఎదిగిన తీరును ఈ వీడియోలో గూగుల్ చూపించింది. హరిత విప్లవం, అంతరిక్షంలోకి శాటిలైట్లు పంపడం మొదలు క్రికెట్ ప్రపంచకప్ ను ముద్దాడడం వరకు అనేక ఘనతలు సాధించింది. ఒకప్పుడు టెక్నాలజీయే పరిచయం లేని దేశం నేడు.. డిజిటల్ చెల్లింపుల్లో అగ్రగామిగా నిలిచింది.

ఇలా చెప్పుకుంటూ పోతే భారత్ విజయాలు ఎన్నో. అయితే రెండు నిమిషాల వీడియోలో గూగుల్ కొన్ని ప్రధాన ఘట్టాలను మాత్రమే ప్రస్తావించింది. 75ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం వేళ ‘ఇండియాకా ఉడాన్’ పేరుతో గూగుల్ ఈ వీడియోను విడుదల చేసింది.