Google నుంచి లోకషన్ హిస్టరీ ఆటోమెటిక్ గా Delete

Google నుంచి లోకషన్ హిస్టరీ ఆటోమెటిక్ గా Delete

Google ని కొత్తగా ఉపయోగించే వారు..లోకేషన్ హిస్టరీ, యాప్ హిస్టరీ, వెబ్ హిస్టరీ మొత్తం ఆటోమెటిక్ గా డిలీట్ కానుంది. సెట్టింగ్స్ లో మార్పులు చేసినట్లు గూగుల్స్ సీఈవో సుందర్ పిచాయ్ తన గూగుల్ బ్లాగ్ ద్వారా వివరించారు.

సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచడం, బాధ్యతగా ఉండడం, నియంత్రణలో ఉండడం..మరింత భద్రతను కల్పించడం కోసం గూగుల్ సరికొత్త ఆవిష్కరణను తీసుకొచ్చిందన్నారు. గూగుల్‌ యూజర్‌ హిస్టరీ 18 నెలల తరువాత ఆటోమేటిక్‌గా డిలీట్‌  అవుతుంది.

డేటాను డిలీట్‌ చేయాలనుకుంటే ఇప్పటి వరకు ఆ పనిని మాన్యువల్‌గా చేయాల్సి ఉండేది, కానీ ఇప్పుడు ఆటోమేటిక్‌గా డిలీట్‌ కానుంది. ఇది గూగుల్‌ అకౌంట్‌ కొత్తగా వాడటం మొదలుపెట్టిన వారికి మాత్రమే వర్తిస్తుందని  గూగుల్‌ వర్గాలు తెలిపాయి.

ఎంచుకునే ఆప్షన్‌ బట్టి డేటా మూడు నెలలకొకసారి లేదా 18 నెలల కొకసారి ఆటోమెటిక్‌గా డిలీట్‌ అవుతుందని గూగుల్‌ ప్రతినిధులు వెల్లడించాయి. దీంతో వినియోగదారుల భద్రత మరింత పెరిగే అవకాశం ఉందని గూగుల్‌ వర్గాలు పేర్కొన్నాయి.

అయితే ప్రస్తుతం ఉపయోగిస్తున్న వినియోగదారుల సెట్టింగ్స్‌ను గూగుల్‌ మార్చబోవడం లేదని కూడా తెలిపారు. ఈ ఆటోమెటిక్‌ డిలిట్‌ ఆప్షన్‌ జీ మెయిల్‌, గూగుల్‌ డ్రైవ్‌కు వర్తించదని వారు తెలిపారు.

Read: మంత్రులు,ఎమ్మెల్యేల కోసం..కరోనా సెంటర్లుగా 100 డీలక్స్‌ రూములు: సామాన్యుల మాటేంటీ?