Google Pay: గూగుల్ పే యూజర్ల కోసం.. ఆన్‌లైన్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు

గూగుల్ పే యూజర్లు ఆన్‌లైన్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఓపెన్ చేసుకునే అవకాశం అతి త్వరలోనే రానుంది. ఫిన్‌టెక్ పార్టనర్ ద్వారా ఈ సదుపాయం మార్కెట్లో రానుందని..

Google Pay: గూగుల్ పే యూజర్ల కోసం.. ఆన్‌లైన్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు

Google Pay (1)

Google Pay: గూగుల్ పే యూజర్లు ఆన్‌లైన్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఓపెన్ చేసుకునే అవకాశం అతి త్వరలోనే రానుంది. ఫిన్‌టెక్ పార్టనర్ ద్వారా ఈ సదుపాయం మార్కెట్లో రానుందని.. దీని గురించి గూగుల్.. సేతుతో కలవనున్నట్లు సమాచారం. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేసెస్ (ఏపీఐ)ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్లు గూగుల్ పేలో ఓపెన్ చేసుకోవచ్చన్న మాట.

ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో సంవత్సరం పాటు డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీని కోసం గరిష్ఠ వడ్డీ రేటు 6.35శాతంగా ఉంది. ఈ ఫెసిలిటీ వాడుకోవాలనుకునేవారు ముందుగా ఆధార్‌తో గూగుల్ పే సర్వీసుకు కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. అది కూడా వన్ టైమ్ పాస్‌వర్డ్ ప్రోసెస్‌తో మాత్రమే.

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ లేకపోయినప్పటికీ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకునే వీలు కల్పించారు. మనకు అకౌంట్ ఉన్న బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ఈక్విటా బ్యాంకుకు మూవ్ అవుతాయి. విత్ డ్రా చేసుకున్న తర్వాత మళ్లీ మన అకౌంట్ లోకి వచ్చేస్తాయి. ఉజ్వన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లలో కూడా ఈ ఫీచర్ వాడుకోవచ్చు. ఒకవేళ ఇది సక్సెస్ అయితే మిగతా యాప్స్ లో కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.

ప్రస్తుతం బీటా వెర్షన్ ను లాంచ్ చేయగా.. ఫిక్స్‌డ్ డిపాజిట్ సమయం 7-29 రోజులు, 30-45 రోజులు, 46-90 రోజులు, 91-180 రోజులు, 181-364 రోజులు, 365గా ఉండనుంది. వడ్డీ రేటు 3.5శాతం నుంచి 6.35శాతం వరకూ అందించనున్నారు. 150 మంది మంత్లీ యాక్టివ్ యూజర్లకు ఈ సర్వీస్ అందనుంది.