Google Free VPN Service : గూగుల్ నుంచి ఫ్రీ VPN సర్వీసులు.. పిక్సెల్ 7 సిరీస్ యూజర్లకు స్పెషల్.. ఏయే దేశాల్లో ఉందో ఇలా చెక్ చేయండి!

Google Free VPN Service : 2022 ఏడాది ప్రారంభంలో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) సొంత పిక్సెల్, పిక్సెల్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను 'Made By Google' ఈవెంట్‌లో లాంచ్ చేసింది.

Google Free VPN Service : గూగుల్ నుంచి ఫ్రీ VPN సర్వీసులు.. పిక్సెల్ 7 సిరీస్ యూజర్లకు స్పెషల్.. ఏయే దేశాల్లో ఉందో ఇలా చెక్ చేయండి!

Google rolls out free VPN service to its Pixel 7 series _ All details

Google Free VPN Service : 2022 ఏడాది ప్రారంభంలో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) సొంత పిక్సెల్, పిక్సెల్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను ‘Made By Google’ ఈవెంట్‌లో లాంచ్ చేసింది. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు పిక్సెల్ వాచ్ కాకుండా కంపెనీ తన హ్యాండ్‌సెట్‌లకు Google One యాప్ ద్వారా ఫ్రీగా VPN సర్వీసులను కూడా ప్రకటించింది.

9to5Google ద్వారా నివేదిక ప్రకారం.. Pixel 7, Pixel 7 Pro యూజర్ల కోసం VPN సర్వీసులను రిలీజ్ చేయడం ప్రారంభించింది. Google వెబ్‌సైట్‌లో VPN సర్వీసులు త్వరలో అందుబాటులోకి వచ్చే దేశాలకు సంబంధించి సపోర్టు పేజీని వెల్లడించింది. ఆ పేజీలో ఏయే దేశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Google rolls out free VPN service to its Pixel 7 series _ All details

Google rolls out free VPN service to its Pixel 7 series _ All details

Google ప్రకారం.. గూగుల్ పిక్సెల్ యూజర్లు తమ హ్యాండ్‌సెట్‌లలో Google Oneని వినియోగిస్తున్నారా? అలా అయితే ఆయా వినియోగదారులు ఇతర దేశాలకు వెళ్లినప్పుడు కూడా VPN సర్వీసులను ఉపయోగించవచ్చు. ఈ VPN సర్వీసులను Pixel 7 యూజర్లతో పాటు 2TB Google One స్టోరేజీతో Google One సబ్‌స్క్రైబర్‌లు కూడా పొందవచ్చు. ముఖ్యంగా, Google One యాప్ Pixel 7లో పిక్సెల్ VPN ద్వారా Google Oneతో వస్తుందని చెప్పవచ్చు.

Ireland
Italy
Japan
Mexico
Netherlands
Norway
South Korea
Spain
Sweden
Switzerland
Taiwan
United Kingdom
United States
Austria
Australia
Belgium
Canada
Denmark
Finland
France
Germany
Iceland

Read Also : WhatsApp Tips : వాట్సాప్‌లో డిలీట్ చేసిన ఫొటోలు, వీడియోలను ఎలా రీస్టోర్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Google One యాప్‌లో VPNని ఎలా యాక్టివేట్ చేయాలో చూద్దాం..
* Google One యాప్‌ని ఓపెన్ చేయండి.
* ఇప్పుడు View వివరాలపై Tap చేయండి.
* ఇంకా, Use VPN టోగుల్ బటన్‌ను ON చేయండి.

Google rolls out free VPN service to its Pixel 7 series _ All details

Google rolls out free VPN service to its Pixel 7 series

యూజర్లు తమ పిక్సెల్ ఫోన్‌లలో VPNని మరొక విధంగా కూడా నిర్వహించవచ్చు.

* Google One యాప్‌ను ప్రారంభించండి.
* Benefits ఆప్షన్ Tap చేయండి.
* VPNకి వెళ్లండి.
* ఇప్పుడు, View వివరాలను Tap చేయండి.
* చివరగా, Enable VPN టోగుల్ ON చేయండి.

గూగుల్ ఇటీవల భారత మార్కెట్లో గూగుల్ ప్లే స్టోర్‌ (Google Play Store)లో బెస్ట్ యాప్‌లు, గేమ్‌ల లిస్టును ప్రకటించింది. Google Play బెస్ట్ ఆఫ్ 2022 అవార్డులుగా Google టాప్ యాప్‌లు, గేమ్‌లకు ఈ వార్షిక అప్‌డేట్ క్వెస్ట్‌ను ‘2022 Best App’గా ఎంపిక చేసింది.

అయితే, అపెక్స్ లెజెండ్స్ మొబైల్, బాటిల్ రాయల్ గేమ్, ‘2022 బెస్ట్ గేమ్’ టైటిల్‌కి ఎంపిక అయింది. Apex Legends Mobile ప్రత్యర్థి BGMI స్థానాన్ని దక్కించుకుంది. 2021లో అత్యుత్తమ గేమ్, డేటా సమస్యల కారణంగా భారత్‌లో నిషేధానికి గురైన సంగతి తెలిసిందే.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Tips : వాట్సాప్‌లో డిలీట్ చేసిన ఫొటోలు, వీడియోలను ఎలా రీస్టోర్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!