Gopichand : ట్రైలర్‌కే ట్రైలర్.. పక్కా కమర్షియల్ ట్రైలర్ గ్లింప్స్ విడుదల.. పూర్తి ట్రైలర్ ఆ రోజే..

 గోపీచంద్ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో బన్నీవాస్ నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాని...............

Gopichand : ట్రైలర్‌కే ట్రైలర్.. పక్కా కమర్షియల్ ట్రైలర్ గ్లింప్స్ విడుదల.. పూర్తి ట్రైలర్ ఆ రోజే..

Gopichand

Pakka Commercial :  గోపీచంద్ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో బన్నీవాస్ నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తుండగా ప్రపంచవ్యాప్తంగా జులై 1న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ ఇప్పటికే రిలీజ్ అవ్వగా తాజాగా ట్రైలర్ అనౌన్సమెంట్ చేస్తూ ట్రైలర్ గ్లింప్స్ విడుదల చేశారు.

పక్కా కమర్షియల్ ట్రైలర్ గ్లింప్స్‌ ముప్పై సెకన్ల వీడియో ఉండగా హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి, హీరో గోపీచంద్ మరియు సత్యరాజ్ కోర్టు గదిలో లాయర్ గెటప్ లో ఉన్నారు. కామెడీగా ఈ గ్లింప్స్ ఉండగా సినిమా కూడా ఇప్పటికే మారుతి జోనర్ లో కామెడీగానే ఉండబోతుందని తెలుస్తుంది. ఇక పూర్తి ట్రైలర్ ని హీరో గోపీచంద్ పుట్టినరోజును పురస్కరించుకుని జూన్ 12న విడుదల చేయనున్నారు.

Suriya : రోలెక్స్ సర్‌కి రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్

అదే రోజు కర్నూల్‌లో భారీగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమంలోనే ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నారు. దీంతో గోపీచంద్ అభిమానులు ఈ ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.