మేయర్ ఎన్నిక, బస్ లో పాట పాడిన గోరెటి వెంకన్న

మేయర్ ఎన్నిక, బస్ లో పాట పాడిన గోరెటి వెంకన్న

Goreti Venkanna Singing Song : అందరూ ఎంతగానో ఉత్కంఠగా ఎదురు చూసిన గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నిక ముగిసిపోయింది. మేయర్ గా గద్వాల విజయలక్ష్మి ఎన్నికకాగా..డిప్యూటీ మేయర్ గా మోతె శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ బలపర్చిన మేయర్ అభ్యర్థికి ఎంఐఎం మద్దతు పలికింది. 138 సభ్యుల మద్దతుతో వీరిద్దరూ గెలిచారు. అయితే…అంతకుముందు..ఉదయం 8.30 గంటలకు తెలంగాణ భవన్‌కు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు చేరుకున్నారు.

తెలంగాణ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశం ముగిసిన అనంతరం నూతన కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు..ప్రత్యేక బస్సుల్లో జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లారు. బస్సులో ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తన గాత్రంతో కార్పొరేటర్లలో జోష్ నింపారు. వెంకన్న పాట పాడుతుంటే..ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు, మాజీ డిప్యటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ చప్పట్లు కొడుతూ కోరస్ కలిపారు. ఆయన పాడిన పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

గోరటి వెంకన్న : –

గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం ద్వారా తెలంగాణ ఉద్యమంలో పని చేసిన వారికి అవకాశం ఇవ్వడంతో పాటు ఎస్సీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని టీఆర్ఎస్ భావించిన సంగతి తెలిసిందే. పల్లె కన్నీరు పెడుతుందో అని తెలంగాణ ప్రజా జీవితాన్ని ప్రపంచానికి చాటిన జానపద కవిగా.. గాయకుడు గోరటి వెంకన్నకు పేరుంది. తెలంగాణ భాషను, యాసను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమ ఆకాంక్షను మరింత బలోపేతం చేశారు. గాయకుడిగానే కాకుండా.. పలు పుస్తకాలను వెంకన్న రాసారు. అలాగే.. హంస, కాళోజీ అవార్డులతో ప్రభుత్వం సత్కరించింది.