‘సలార్’ లో శృతి

‘సలార్’ లో శృతి

Shruti Haasan: రెబల్ స్టార్ ప్రభాస్, ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో, హోంబలే ఫిలింస్ బ్యానర్లో ‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’.. ఈ సినిమాలోని ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా డార్లింగ్‌కి జోడీగా నటించబోయే హీరోయిన్‌ని ఫిక్స్ చేశారు. బ్యూటిఫుల్ యాక్ట్రెస్, మ్యుజిషియన్ శృతి హాసన్ బర్త్‌డే (జనవరి 28) సందర్భంగా ఆమెకు విషెస్ తెలుపుతూ.. ‘సలార్’ చిత్ర యూనిట్ శృతి, ప్రభాస్‌ పక్కన నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

https://10tv.in/salaar-shooting-starts-in-ramagundam/

శృతి హాసన్, ప్రభాస్ ఫస్ట్ టైం కలిసి నటిస్తున్నారు. జనవరి 29 నుండి ఫిబ్రవరి 12 వరకు తెలంగాణ, పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ‘సలార్’ ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో సహా ఇతర ప్రధాన తారాగణమంతా పాల్గొంటారు. కన్నడ, తెలుగు, తమిళ్ భాషలకు చెందిన కొత్త నటీనటులు కూడా పరిచయం కాబోతున్నారు.

Prabhas