Covid Vaccine Deaths : కొవిడ్‌ వ్యాక్సిన్ మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదు.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

కొవిడ్‌-19 టీకా తీసుకోవడం వల్ల దుష్ప్రభావాల కారణంగా సంభవించే మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదని కేంద్రం స్పష్టం చేసింది. కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ను ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ప్రోత్సహించిందని, టీకాలు వేయడానికి చట్టపరమైన బలవంతం ఏమీ లేదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Covid Vaccine Deaths : కొవిడ్‌ వ్యాక్సిన్ మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదు.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

Covid Vaccine Deaths

Covid Vaccine Deaths : కొవిడ్‌-19 టీకా తీసుకోవడం వల్ల దుష్ప్రభావాల కారణంగా సంభవించే మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదని కేంద్రం స్పష్టం చేసింది. కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ను ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ప్రోత్సహించిందని, టీకాలు వేయడానికి చట్టపరమైన బలవంతం ఏమీ లేదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ దుష్ప్రభావాల కారణంగా గతేడాది ఇద్దరు బాలికలు మరణించగా.. తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. ఇది విషాదకరమైనా.. కొవిడ్ టీకా మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదని కేంద్ర ఆరోగ్యశాఖ తేల్చి చెప్పింది.

అర్హులైన వ్యక్తులు టీకా వేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించిందని, అయితే దానికి ఎలాంటి చట్టపరమైన బలవంతం లేదని అఫిడవిట్‌లో పేర్కొంది. అయితే, ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగస్టు 29న కేంద్రానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది. శవ పరీక్ష, విచారణ నివేదికలను సమయానుకూలంగా విడుదల చేయడంతోపాటు మరణంపై స్వతంత్ర కమిటీతో దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మృతుల తల్లిదండ్రులకు పరిహారం ఇవ్వాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

Covid-19 Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే 5 వేల బహుమతి.. కేంద్రం స్పష్టత

వ్యాక్సిన్‌ దుష్ప్రభావాలతో బాధపడుతున్న వ్యక్తులను ముందస్తుగా గుర్తించి చికిత్స అందించేందుకు మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రభుత్వానికి ఆదేశాలను ఇవ్వాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును కోరారు. ప్రతి వ్యాక్సిన్‌కు ఇమ్యునైజేషన్ అనుసరించే ప్రతికూల సంఘటనలు నివేదించబడుతున్నాయని కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలిపారు. వ్యాక్సిన్లు థర్డ్‌ పార్టీలతో తయారవుతున్నాయని చెప్పారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సమాచారం పబ్లిక్‌ డొమైన్‌లో ఉచితంగా అందుబాటులో ఉందని కోర్టుకు తెలిపారు.

కాగా, పిటిషనర్ల నష్ట పరిహారం డిమాండ్‌ను ఆరోగ్యమంత్రిత్వ శాఖ తోసి పుచ్చింది. వ్యాక్సినేషన్‌ ప్రతికూల ప్రభావాలతో వ్యక్తి శారీరకంగా గాయమైనా, మరణించినా చట్టప్రకారం అతని కుటుంబం పరిహారం కోరుతూ సివిల్‌ కోర్టులో దావా వేయవచ్చని, నిర్లక్ష్యానికి సంబంధించిన కేసుల వారీగా కేసు నమోదు చేయవచ్చని అఫిడవిట్ పేర్కొంది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కొలిన్ గోన్సాల్వేస్ వాదనలు వినిపిస్తూ.. వ్యాక్సిన్‌తో కలిగే నష్టాలను ముందుగానే తెలియజేసి సమ్మతి తీసుకుని ఉంటే ఈ మరణాలు సంభవించి ఉండేవి కావని అభిప్రాయపడ్డారు.

Covid Vaccine: పొరపాటున కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేశారు.. ఆసుపత్రిపాలైన శిశువులు

వ్యాక్సిన్లు, మందులను స్వచ్ఛందంగా వినియోగించేందుకు ‘సమ్మతి’ అనే ప్రశ్న వర్తించదని, మోతాకు సంబంధించి ప్రతికూల ప్రభావాలు స్వల్పంగా ఉంటాయని పేర్కొంది. ఈ నెల 19 వరకు దేశంలో 219.86కోట్ల డోసులు ఇవ్వగా.. వీటిలో 92,114 ప్రతికూల ప్రభావాల కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇదిలావుంటే ఓ బాలిక గతేడాది 29న కోవిషీల్డ్‌ మొదటి డోసు తీసుకున్న తర్వాత జూన్‌ 19న మరణించారు. ఎంఎస్సీ చదువుతున్న మరో విద్యార్థిని గత ఏడాది జూన్‌ 18న కొవిషీల్డ్‌ మొదటి డోసు తీసుకోగా.. జూలై 10న మృతి చెందడం గమనార్హం.