గోరువెచ్చని నీరు తాగాలి.. గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి… ఇంట్లో ఉండే కరోనా రోగులకు ప్రభుత్వం మార్గదర్శకాలు

లక్షణాలు లేని కరోనా రోగులు ఇంట్లోనే ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు

  • Published By: naveen ,Published On : June 16, 2020 / 07:59 AM IST
గోరువెచ్చని నీరు తాగాలి.. గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి… ఇంట్లో ఉండే కరోనా రోగులకు ప్రభుత్వం మార్గదర్శకాలు

లక్షణాలు లేని కరోనా రోగులు ఇంట్లోనే ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు

లక్షణాలు లేని కరోనా రోగులు ఇంట్లోనే ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 

* కరోనా బాధితులు రోజూ 2 లీటర్ల గోరువెచ్చటి నీటిని తాగాలి.
* ఇంట్లో గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి.
* ఆరోగ్యంగా ఉన్న కుటుంబ సభ్యులే వారికి సేవలందించాలి. 
* చిన్నపిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు రోగికి దూరంగా ఉండాలి. 
* అస్వస్థత లక్షణాలు తీవ్రమైతే వెంటనే వైద్యసహాయం తీసుకోవాలి. 
* రోగి ఉన్న గదిలోని వస్తువులను కుటుంబసభ్యులు ఎవరూ తాకొద్దు.
* జంక్‌ ఫుడ్‌, కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. 

* కరోనా రోగి ఇంట్లో ఉన్నప్పుడు వారి కుటుంబసభ్యులు వైద్యుల సలహా మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు వేసుకోవాలి. 
* కరోనా రోగి తుమ్మినా, దగ్గినా కర్చీఫ్/టిష్యూ పేపర్‌ను అడ్డుపెట్టుకోవాలి. 
* టిష్యూ పేపర్‌ను మాస్క్‌తోపాటు పారేయాలి. 
* రోగికి ప్రత్యేకంగా టాయ్‌లెట్‌ ఉండాలి. 
* దానిని ఉపయోగించడానికి ముందు, తరువాత చేతులను సబ్బుతో కడుక్కోవాలి. 
* టాయ్‌లెట్‌ను కూడా శుభ్రపరచాలి. 
* రోగి తన గదిని తానే శుభ్రం చేసుకోవాలి. 
* గదిని క్రిమిసంహారం లేదా బ్లీచింగ్‌ పౌడర్‌తో (లీటరుకు 3 స్పూన్ల చొప్పున) శుభ్రపరచాలి. 
* వారికి కేటాయించిన వస్తువులనే వాడాలి. 
* ఇతరుల వస్తువులతో కలపొద్దు. 
* వారువాడిన బెడ్‌షీట్స్‌, టవల్‌, ఇతర వస్త్రాలను డెటాల్ వేసిన వేడినీటిలో అరగంట నానబెట్టి ఉతకాలి. 
* పునర్వినియోగ మాస్క్‌/రుమాలును బ్లీచింగ్‌ పౌడర్‌తో తయారుచేసిన క్రిమిసంహారకాలతో 30 నిమిషాలు నానబెట్టి ఉతకాలి. 
* బాధిత వ్యక్తి మందులను క్రమం తప్పకుండా వాడాలి
* ఇతర ఇబ్బందులు ఏర్పడితే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 599 4455కు ఫోన్‌ చేయాలి. 
* రోగి తన గదిలోని చెత్తబుట్టలో వేసిన వస్తువులను ఇంటిబయట కాల్చివేయాలి.

కరోనా రోగికి సేవలందించేవారు తప్పకుండా పాటించాల్సినవి:
* కరోనా రోగికి సేవలందించేవారు మూడు పొరల మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలి. 
* రోగి ముక్కు, నోరు, కండ్లను తాకవద్దు. 
* రోగికి సేవలందించడానికి ముందు, తర్వాత చేతులను సబ్బుతో కనీసం 40 నుంచి 60 సెకన్ల పాటు కడుక్కోవాలి. 
* రోగి శరీరం నుంచి వచ్చే చెమట, నోటి నుంచి, ముక్కు నుంచి, కళ్లు నుంచి కారే స్రావాలను తాకొద్దు. 
* రోగి వాడిన ఏ వస్తువునైనా 30 నిమిషాలు వేడినీటిలో ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకొని తిరిగి వాడుకోవచ్చు. 
* మనం నివసిస్తున్న ప్రాంతంలో ఎవరికైనా కరోనా సోకితే ఇతరులు భయపడాల్సిన అవసరం లేదు. 
* పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 
* తరచుగా నడిచే మెట్లు, గోడలు, లిఫ్ట్‌ బటన్స్‌ను పలుమార్లు శుభ్రం చేయాలి. 
* మీ చుట్టుపక్కల ఎవరికైనా స్టాంప్‌ వేసి, వారు ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతున్నట్టయితే వెంటనే 1800-599-4455కు ఫోన్‌ చేసి చెప్పాలి.