Jr NTR: తాత సెంటిమెంట్.. లంబోర్ఘిని కోసం రూ.17 లక్షల నెంబర్!

మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్లకు కార్లు, బైక్స్ అంటే పిచ్చి. ఒక్కొక్కరి గ్యారేజీలలో రకరకాల కార్లు కొలువుదీరి ఉంటాయి. మార్కెట్ లోకి కొత్తగా కారు వస్తే తమ దగ్గర..

Jr NTR: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్లకు కార్లు, బైక్స్ అంటే పిచ్చి. ఒక్కొక్కరి గ్యారేజీలలో రకరకాల కార్లు కొలువుదీరి ఉంటాయి. మార్కెట్ లోకి కొత్తగా కారు వస్తే తమ దగ్గర ఆ కలెక్షన్ ఉండాలని ఆరాటపడుతుంటారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందు వరసలో ఉంటాడు. తారక్ కి బైకులు, కార్లంటే చాలా ఇష్టం. ఈ మధ్యనే కోట్లు పెట్టి మరీ లంబోర్ఘిని ఊరుస్ కారును ప్రత్యేకంగా ఇటలీ నుంచి తెప్పించుకున్న సంగతి తెలిసిందే కాగా దీనికోసం తారక్ కోట్లు ఖర్చు చేశాడు.

Naga Chaitanya: విజయ్ స్థానంలో చైతూ.. మజిలీ కాంబినేషన్ రిపీట్ చేస్తారా?

కారు దిగుమతి చేసుకోవడమే కాదు ఇప్పుడు ఫ్యాన్సీ నెంబర్ కోసం కూడా లక్షలు ఖర్చు పెట్టాడు. తాజాగా ఖైరతాబాద్‌ ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నంబర్లను వేలం వేయగా TS 09 FS 9999 నంబర్‌ను తారక్ రూ.17 లక్షలు పెట్టి దక్కించుకున్నాడు. ఎన్టీఆర్ కు 9 అనే నెంబర్ ఇష్టమైన నెంబర్ కాగా 9999 ఫ్యాన్సీ నెంబర్ వాహనాలలో తారక్ సెంటిమెంట్. ఇప్పటికే ఎన్టీఆర్‌ దగ్గరున్న కార్లన్నింటికీ 9999 నంబర్‌ ఉంటుంది. కారు మాత్రమే కాదు తారక్ ట్విటర్‌ ఖాతాలో కూడా ఎన్టీఆర్‌ @tarak9999 కనిపిస్తుంది.

Big Boss 5: ఏడ్చేసిన లోబో.. లహరి, శ్రీరామ్‌కు పెళ్లి చేసిన హౌస్ మేట్స్!

కాగా, ఈ నంబర్ వెనుక అసలు కారణం ఏమిటంటే తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు. తాత ఎన్టీఆర్ కారు నంబర్ కూడా 9999. గతంలో జూనియర్ తండ్రి హరికృష్ణ కూడా అదే నంబర్ కారును వాడేవారు. అందుకే తనకు కూడా ఆ నెంబర్‌ ఇష్టమని తారక్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే తారక్ ఎప్పుడు కొత్త బండి కొన్నా దానికి 9999 రిజిస్ట్రేషన్ నెంబర్ దక్కేలా చూసుకుంటాడు. అవసరమైతే వేలంలో పాల్గొని దక్కించుకుంటాడు.

ట్రెండింగ్ వార్తలు