A tear-jerking story : మనవడి చికిత్స కోసం మేకప్ బ్యూటీ బ్లాగర్‌గా మారిన పెద్దాయన.. కన్నీరు తెప్పించే కథ

వయసు 72.. ఆ వయసులో ఓ వృద్ధుడు మేకప్ ఉత్పత్తుల ప్రచారం చేస్తూ పని చేస్తున్నాడు. ఈ వయసులో ఈయనకి ఎందుకొచ్చిన పనీ అనుకుంటున్నారా? ఆయన ఎందుకలా చేస్తున్నాడో తెలిస్తే మనసు కదిలిపోతుంది.

A tear-jerking story : మనవడి చికిత్స కోసం మేకప్ బ్యూటీ బ్లాగర్‌గా మారిన పెద్దాయన.. కన్నీరు తెప్పించే కథ

A tear-jerking story

Grandfather working as a beauty blogger : చైనాలో 72 ఏళ్ల వృద్ధుడు మేకప్ ఉత్పత్తుల ప్రచారం కోసం పని చేస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న మనవడి చికిత్స కోసం అతను పడుతున్న కష్టం అందరి మనసుల్ని కదిలిస్తోంది.

Love Holidays in China : యువతకు ‘ప్రేమపాఠాలు’ నేర్పుతున్న చైనా ప్రభుత్వం..! ప్రేమించుకోవటానికి విద్యార్ధులకు సెలవులు..!!

72 ఏళ్ల జు యున్‌చాంగ్ చైనీస్ పెన్షనర్.. రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో కష్టపడుతున్నాడు. వృద్ధ్యాప్యం మీద పడ్డా బ్యూటీ బ్లాగర్‌గా పని చేస్తున్నాడు. . జు యున్‌చాంగ్ మనవడు జియావో జింగ్యాన్ ఆరు సంవత్సరాలుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అదే వెన్నెముక కండరాల క్షీణత.. దీనిని గుర్తించిన సమయంలో వైద్యులు అతను కేవలం 18 నెలలు మాత్రమే జీవిస్తాడని చెప్పారు. అయితే కుటుంబ సాయంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అదీ అంత సులువుగా కాదు. US నుంచి మాత్రమే దిగుమతి అయ్యే ఓ ఔషధం వల్ల.  దాని ధర సుమారు 7,00,000 యువాన్లు ($100,000).

 

జియావో ఖరీదైన  చికిత్స కోసం ఇల్లు అమ్మేసారు. డబ్బు ఖర్చు పెట్టారు. అయినా సరిపోలేదు. జు యున్‌చాంగ్ పెన్షన్ సరిపోలేదు. ఇక అలాంటి టైంలో అతను ఏం చేయాలా? అని వేరే మార్గాలను అన్వేషించినపుడు మేకప్ ఉత్పత్తులను ఆన్ లైన్ విక్రయించాలనే ఆలోచన వచ్చింది. ముందు వీటిని తయారు చేసే వారిని సంప్రదించాడు. తను కొన్ని కంపెనీలకు పని చేస్తానని అడిగినపుడు ఇంత పెద్దాయనతో ఏం చేస్తాడని తిరస్కరించారు. అయినా అతను పట్టుదలగా ప్రయత్నించాడు. మొత్తానికి పని సంపాదించిన జు యున్‌చాంగ్ కి ఆన్ లైన్‌లో ఆదరణ లభించింది. అలా మనవడి కోసం కష్టపడి డబ్బుులు సంపాదించడం మొదలుపెట్టాడు.

Hitech Fraud : మాయాజూదంలో శకునినే మించిపోయాడు.. పేకముక్కల్లో చైనా సెన్సార్లతో ఘరానా మోసం

తన మనవడి కోసం ఎంతైనా కష్టపడతాను అంటాడు జు యున్‌చాంగ్. తను చనిపోయే లోపు అతని మనవడు తిరిగి నడవగలిగితే చాలని కోరుకుంటున్నాడు. జు యున్‌చాంగ్ మనవడు పూర్తి ఆరోగ్యవంతుడు కావాలని మనసారా కోరుకుందాం.