21 Nail Turtle: కట్నంగా 21 కాలి వేళ్ల తాబేలు.. చివరికి కటకటాల పాలు!

పెళ్ళికి ముందే నిశ్చతార్ధానికే అడిగిన వరకు కట్నం ఇచ్చారు. కానీ ఆ యువకుడి కుటుంబానికి ఆశ తీరలేదు. యువతి కూడా ఉన్నత చదువులు చదువుకొని ఉండడంతో ఆమెకి ఉద్యోగం ఇప్పిస్తామని.. పెళ్లి తర్వాత ఇద్దరూ ఉద్యోగాలైతే వారి జీవితం ఇంకా ఆనందంగా ఉంటుందని చెప్పడంతో ఉద్యోగం కోసమని మరో పదిలక్షలు యువకుడి కుటుంబానికి ఇచ్చారు.

21 Nail Turtle: కట్నంగా 21 కాలి వేళ్ల తాబేలు.. చివరికి కటకటాల పాలు!

21 Nail Turtle

21 Nail Turtle: పెళ్ళికి ముందే నిశ్చతార్ధానికే అడిగిన వరకు కట్నం ఇచ్చారు. కానీ ఆ యువకుడి కుటుంబానికి ఆశ తీరలేదు. యువతి కూడా ఉన్నత చదువులు చదువుకొని ఉండడంతో ఆమెకి ఉద్యోగం ఇప్పిస్తామని.. పెళ్లి తర్వాత ఇద్దరూ ఉద్యోగాలైతే వారి జీవితం ఇంకా ఆనందంగా ఉంటుందని చెప్పడంతో ఉద్యోగం కోసమని మరో పదిలక్షలు యువకుడి కుటుంబానికి ఇచ్చారు. కానీ, పెళ్లి నాటికి ఆ కుటుంబానికి మితిమీరిన గొంతిమ కోర్కెలు పుట్టాయి.

పెళ్లి రోజుకి కట్నంగా 21 కాలి వేళ్లున్న తాబేలు, బ్లాక్ లాబ్రడార్‌ను ఇవ్వాలని యువతి కుటుంబాన్ని ఆదేశించారు. అప్పటికీ ఆ యువతి కుటుంబం వారు చెప్పిన తాబేలు కోసం ఎంతగానో ప్రయత్నించింది. కానీ ఆ తాబేలు దొరకలేదు. దీంతో ఆ యువకుడి కుటుంబం పెళ్లి రద్దు చేసింది. దీంతో ఆ యువతి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ యువకుడి కుటుంబంపై కేసు నమోదైంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈ ఘటన జరిగింది.

నాసిక్‌కు చెందిన ఆర్మీ జవాన్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఔరంగాబాద్‌కు చెందిన ఒక మహిళతో నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్‌మెంట్‌కు ముందు రెండు లక్షల నగదు, పది గ్రాముల బంగారాన్ని కట్నంగా ఇచ్చారు. ఎంగేజ్‌మెంట్‌ తర్వాత వధువుకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని వరుడి కుటుంబం మరో పది లక్షలు తీసుకోగా.. ఇప్పటికీ ఆ ఉద్యోగం ఊసేలేదు. ఇక పెళ్లి సమయానికి 21 కాలి వేళ్లున్న తాబేలుతోపాటు బ్లాక్ లాబ్రడార్‌ను కట్నంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఈ తాబేలు ధర మార్కెట్‌లో ఐదు నుంచి పది లక్షలు ఉన్నా.. వధువు కుటుంబం ఎంతో ప్రయత్నించింది. కానీ దొరకలేదు. దీంతో వరుడి కుటుంబం పెళ్లి రద్దు చేసుకుంది. ఇక, అప్పటికే వధువు కుటుంబం ఇచ్చిన కట్నం వెనక్కు ఇవ్వాలని కోరినా అందుకు నిరాకరించారు. దీంతో వధువు కుటుంబం పోలీసులకు ఫిర్యాదుతో వరుడి కుటుంబ సభ్యులపై చీటింగ్‌ కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.