Groundfridge : ఈ ఫ్రిడ్జ్‌‌కు అసలు విద్యుత్తే అవసరం లేదు..మరెలా పని చేస్తుంది ? ఓసారి లుక్కేయండి

ఓ కంపెనీ గ్రౌండ్ ఫ్రిడ్జ్ లను తయారు చేస్తోంది. వీటికి కరెంటు అవసరం లేదు. పర్యావరణాన్ని కోరుకొనే వారికి ఈ ఫ్రిడ్జ్ చాలా అనుకూలంగా ఉంటుందంటున్నారు. డచ్ కంపెనీ ఇలాంటి ఫ్రిడ్జ్ లను తయారు చేస్తోంది. దీని ధర భారతదేశ కరెన్సీలో రూ. 15 లక్షలుగా ఉందని తెలుస్తోంది.

Groundfridge : ఈ ఫ్రిడ్జ్‌‌కు అసలు విద్యుత్తే అవసరం లేదు..మరెలా పని చేస్తుంది ? ఓసారి లుక్కేయండి

Fridge

Groundfridge : ఫ్రిడ్జ్…మధ్య తరగతి నుంచి మొదలుకుని సెలబ్రెటీల వరకు ఉపయోగిస్తుంటారు. ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండడం ఇప్పుడు కామన్ అయిపోయింది. దీనికి కరెంటు అవసరం. కరెంటు లేని ఫ్రిడ్జ్ ఉంటే బాగుండే అనిపిస్తుంటుంది. కరెంటు బిల్లును ఆదా చేసేందుకు అనువుగా ఉంటుంది. అయితే..ఓ కంపెనీ గ్రౌండ్ ఫ్రిడ్జ్ లను తయారు చేస్తోంది. వీటికి కరెంటు అవసరం లేదు. పర్యావరణాన్ని కోరుకొనే వారికి ఈ ఫ్రిడ్జ్ చాలా అనుకూలంగా ఉంటుందంటున్నారు.

Read More : Akash-NG : ఆకాశ్​ మిసైల్ ప్రయోగం విజయవంతం..ప్రతికూల వాతావరణంలోనూ తప్పని గురి

డచ్ కంపెనీ ఇలాంటి ఫ్రిడ్జ్ లను తయారు చేస్తోంది. దీని ధర భారతదేశ కరెన్సీలో రూ. 15 లక్షలుగా ఉంది. గ్రౌండ్ ఫ్రిడ్జ్ పేరిట మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. దీని కెపాసిటీ 3 వేల లీటర్లు ఉంటుందని, మొత్తం 20 కుటుంబాలు ఉపయోగపడుతుందని వెల్లడిస్తున్నారు. అయితే..ఈ ఫ్రిడ్జ్ కోసం మాత్రం ఓ సొరంగాన్ని తవ్వాల్సి ఉంటుంది. ఏడు అడుగుల లోతు, 8X8 అడుగుల వెడల్పు తవ్వాల్సి ఉంటుంది. భారీ గోళాకారంలో ఉన్న ఈ ఫ్రిడ్జ్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫ్రిడ్జ్ లో నాలుగు షెల్వ్స్ లున్నాయి. వీటిల్లో ఫుడ్ స్టోరేజ్ చేసుకోవచ్చు. బయట తగిలే సూర్యరశ్మి వల్ల ఫ్రిడ్జ్ లోపల టెంపరేచర్స్ మారుతుంటాయి. భూమి లోపల ఫ్రిడ్జ్ కు చల్లటి గాలిని అందించేందుకు బ్యాటరీలను అమర్చారు.