దేశ వ్యాప్తంగా పెరుగుతున్న మహిళా పోలీసులు

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న మహిళా పోలీసులు

Growing women cops across in the India : ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితంగా ఉండేవారు. కాలం మారింది. ఆంక్షల సంకెళ్లు తెంచుకుని వంటింటి నుంచి నెట్టింటికొచ్చారు.అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఆకాశంలో సంగంగా ఉన్న మహిళలు నింగిలో సైతం గెలుపు సంతకాలు చేస్తున్నారు. ఉద్యోగాలు..వ్యాపారాల్లోను..క్రీడల్లోను తమదైన ముద్ర వేస్తున్నారు. దేశ సైన్యంలో సైతం తమ సేవలను అందిస్తున్నారు. అటు ఉద్యోగాల నిర్వహణ ఇటు ఇంటి బాధ్యతలతో ఆడవారికి సాటి ఎవ్వరూ లేరనిపిస్తున్నారు.

ముఖ్యంగా పోలీసు ఉద్యోగాల్లో కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకూ మహిళా మణులు సేవలందిస్తున్నారు. పురుషుల ధీటుగా పోలీసు ఉద్యోగాల్లో మహిళల సంఖ్య పెరుగుతోంది. బ్యూరో ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (BPR&D) మంగళవారం ( డిసెంబర్ 29,2020) విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది.

దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలీసులు బలగాల్లో మహిళ వాటా 16శాతం పెరిగింది. అయితే వద్ధి 16 శాతం ఉన్నాగానీ..మొత్తంగా చూస్తే మహిళా పోలీసులు సంఖ్య చాలా తక్కువగానే ఉంది. దేశ వ్యాప్తంగా గత ఏడాది జనవరి 1నాటికి మహిళా పోలీసులు 8.9 శాతం మంది ఉండగా ఈ ఏడాది జనవరి 1 నాటికి అది 10.3 శాతానికి పెరిగింది. గత సంవత్సరం అంటే 2019తో 1 లక్షా 85వేలమంది మహిళా పోలీసులు ఉండగా ఈ ఏడాది 2020లో ఆ సంఖ్య 2 లక్షల 15వేలకు పెరిగిందని నివేదిక వెల్లడించింది.

అదే సాయుధ పోలీసు బలగాల్లో (CAPF)మహిళల సంఖ్య మాత్రం కేవలం 2.9 శాతం మంది మాత్రమే ఉన్నారు.మొత్తం 9.9 లక్షల మంది ఉన్న CAPFలో మహిళ వాటా కేవలం 29,2499. అందులో CAPFలో 8,631,CRPFలో 7,860, GSF లో 5,130 మంది మహిళలు ఉన్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..వెనుకబడిన రాష్ట్రంగా పిలిచ్చే బీహార్ రాష్ట్రంలోనే మహిళా పోలీసులు ఎక్కువమంది ఉండటం. బీహార్ లో సివిల్ పోలీస్, ప్రత్యేక సాయుధ బలగాలు, జిల్లా సాయుధ రిజర్వ్,ఇండియా రిజర్వ్ బెటాలియన్స్  అన్నింటిలోను కలిపి దాదాపు 25.3 శాతంమంది మహిళలున్నారు.

బీహార్ తరువాత హిమాచల్ ప్రదేశ్ లో 19.15శాంతం మంది, ఛండీగఢ్ లో 18.78 శాతం,తమిళనాడులో 18.5 శాతం మంది మహిళా పోలీసులున్నారు. అయితే దేశ వ్యాప్తంగా మహిళలకు కేటాయించిన 20శాతం పోలీసు పోస్టులు మాత్రం ఇంకా ఖాళీగానే ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకూ భర్తీ చేయలేదు.

2014 నుంచి మహిళా పోలీసుల సంఖ్య నిలకడగా పెరుగుతూ వస్తోంది. మహిళలకు కేటాయించిన రిజర్వేషన్లు పెరగటంతో వారి సంఖ్య పెరుగుతోంది.14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో 20శాతం, మూడు రాష్ట్రాల్లో 10శాతం చొప్పున రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అలాగే కేంద్ర బలగాల్లో కూడా రిజర్వేషన్లు అమలవుతున్నాయి.

కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం మహిళా పోలీసుల సంఖ్య ఏమాత్రం ఆశాజనకంగా లేదు.చాలా తక్కువగా ఉంటోంది. జమ్ము కశ్మీర్ లో అతి తక్కువగా 3.31 శాతం ఉండగా తెలంగాణలో కేవలం 5.11 శాతం మంది మాత్రమే ఉన్నారు.

దేశ వ్యాప్తంగా చూసుకుంటే ప్రజల డిమాండ్ కు తగినట్లుగా పోలీసు సిబ్బంది లేరు. పైగా రోజు రోజుకు నేరాల సంఖ్య పెరగుతుండటం..పోలీసులు సంఖ్య దానికి తగినంతగా లేకపోవటంతో చాలా వరకూ నేరాల కేసులు పెండింగ్ లోనే ఉండిపోతున్నాయి.

ప్రతీ లక్ష మంది జనాభాకు ఉండాల్సిన పోలీసుల కేటాయింపుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయిందనే చెప్పాలి. గత సంవత్సరం ఆ సంఖ్య 158.2గా ఉండేది. ఇప్పుడది 155.7 కు పడిపోయింది. గత ఏడాది జనవరి 1 నాటికి ప్రతీ లక్ష మంది జనాభాకు 198.4 మంది పోలీసులుండా ఇప్పుడది 195.4కు పడిపోయింది.

నాగాలాండ్ లో ప్రతీ లక్ష మంది జనాభా 1301 మంది పోలీసులు న్నారు. అండమాన్ నికోబార్ దీవులు, మణిపూర్ ,సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ తరువాత స్థానాల్లో ఉన్నాయి. అతి తక్కువగా బీహార్ లో ప్రతీ లక్ష మందికి కేవలం 76.2 మంది పోలీసులు సిబ్బందే ఉన్నారు. ఆ తరువాత ఏపీ, మధ్యప్రదేశ్,పశ్చిమ బెంగాల్ లలో అతి తక్కువమంది పోలీసు సిబ్బంది ఉన్నారు.