అఖిల్ బాబు బ్యూటిఫుల్ సాంగ్ విన్నారా!

అఖిల్ బాబు బ్యూటిఫుల్ సాంగ్ విన్నారా!

Guche Gulabi: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న రొమాంటిక్ మూవీ.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, దర్శకుడు వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు.

ఇటీవల విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ అండ్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అఖిల్, పూజా హెగ్డేల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.​ వాలెంటైన్స్ డే సందర్భంగా ఒకరోజు ముందుగా శనివారం ‘గుచ్చే గులాబిలా’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

https://10tv.in/most-eligible-bachelor-in-cinemas-from-19th-june-2021/

గోపి సుందర్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. అనంత శ్రీరామ్, శ్రీమణి లిరిక్స్ రాశారు. అర్మాన్ మాలిక్ పాడారు. ‘అరె.. గుచ్చే గులాబిలాగా.. నా గుండె లోతునే తాకినదే.. వెలుగిచ్చే మతాబులాగా.. నా రెండు కళ్లల్లో నిండినదే.. ఎవరే నువ్వే, ఏం చేసినావే.. ఎటుగా నన్నే లాగేసినావే.. చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే’’.. అంటూ సాంగ్ ఈ కూల్
సాంగ్ బ్యూటిఫుల్‌గా ఉంది.. ప్రేమికుల ఫేవరెట్ ప్లే లిస్ట్‌లో ఈ సాంగ్ ఉంటుందనడంలో సందేహం లేదు. జూన్ 19న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.