సర్జరీలు చేయించుకుని ఆడవారిగా మారిపోతున్న మగవారు..!!

సర్జరీలు చేయించుకుని ఆడవారిగా మారిపోతున్న మగవారు..!!

20 men want to be women through surgery : ఆడపిల్ల పుడితే పురిటిలో అంతమొందిచేస్తున్న ఈరోజుల్లో..ఏమాత్రం కనికరం లేకుండా పసిగుడ్డులను ముళ్లపొదల్లో పారేస్తున్న ఈ రోజుల్లో కొంతమంది మగవారు ఆపరేషన్లు చేయించుకుని ఆడవారిగా మారిపోతున్నారు..! గుజరాత్ లో ఇటువంటి లింగమార్పిడి ఆపరేషన్లు ఇటీవల బాగా పెరుగుతున్నాయి..!! అలా ఇప్పటి వరకూ 1000 ఆపరేషన్లు జరిగాయని నిపుణులు తెలుపుతున్నారు.

అసలు విషయం ఏమిటంటే.. స్త్రీ, పురుష మనస్తత్వాలు కలిగిన పలువురు పురుషులు ఆడవారిగా మారిపోతున్నారు. అలా 20మంది సర్జరీలకు సంబంధించిన వివిధ స్టేజిలలో ఉన్నారు. జండర్ ఛేంజ్ చేయించుకుంటున్న వీరంతా ధైర్యంగా తమ పరిస్థితిని ఆయా ప్రాంతాల్లో వారికి తెలియజేస్తున్నారు. తమ పరిస్థితి గురించి పూర్తిగా చెబుతున్నారు. కొత్త గుర్తింపును కోరుకుంటూ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారికి గ్రామస్తులు కూడా మద్దతు పలుకుతున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ హర్ష్ అమీన్ మాట్లాడుతూ గత రెండేళ్లలో అంటే 2020-21లోఅహ్మదాబాబాలో 1000కి పైగా సర్జరీలు జరిగాయని తెలిపారు. తాను 14 మంది పురుషులకు సర్జరీలు చేశానని..ఈ విధంగా సర్జరీ చేయించుకుంటామని తన దగ్గరకు ప్రతీరోజూ 50 నుంచి 60 మంది వరకూ వస్తుంటారని తెలిపారు. నాలాంటి సర్జన్లు అహ్మదాబాద్ లో 80మందికిపైగా ఉన్నారని తెలిపారు.

ఇటువంటి సర్జరీకి కార్పొరేట్ ఆసుపత్రులలో సుమారు రూ. 8 లక్షల వరకూ ఖర్చవుతుందని తెలిపారు. కొంతమంది వారి వారి ఆర్థిక స్థాయిలకు బట్టి విదేశాలకు వెళ్లి ఇటువంటి సర్జరీలు చేయించుకుంటారని అహ్మదాబాద్ లోని సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ లగవంకర్ తెలిపారు.

గుజరాత్ లోని అహ్మదాబాద్ కే చెందిన 25ఏళ్ల డాక్టర్ జెస్నూర్ డయారా.. విషయంలో కూడా అటువంటి ఆపరేషనే జరిగిందని తెలిపారు. రష్యాకు చెందిన వైద్య యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. దీని ద్వారా గుజరాత్‌ రాష్ట్రంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్‌గా రికార్డు సృష్టించారామె.

అంతేకాదు పురుడిగా పుట్టి స్త్రీగా మారిన డాక్టర్ జెస్నూర్ డయారా..తాను పురుషుడిగా ఉన్నప్పుడు తన వీర్యంతో భద్రపరిచింది. (భద్రపరిచాడు) అదే వీర్యంతో స్త్రీగా మారిన తరువాత ఓ బిడ్డకు తల్లి అవ్వాలని ఉవ్విళ్లూరుతోంది డాక్టర్ జెస్నూర్ డయారా..!! ఆమె అనుకున్నదే జరిగితే ఒక బిడ్డకు తల్లి, తండ్రి తానే అయిన ఏకైక వ్యక్తిగా డయారా రికార్డు సృష్టిస్తుంది…!!