పాలు అమ్మి ఏడాదికి కోటిపైనే సంపాదిస్తున్న 62 ఏళ్ల మహిళ

పాలు అమ్మి ఏడాదికి కోటిపైనే సంపాదిస్తున్న 62 ఏళ్ల మహిళ

Gujarat 62 years woman milk Income Rs 1.10 crore  : 60 ఏళ్లు వచ్చాయంటే మంచానికే పరిమితం అయిపోయే వారికి గుజరాత్ లోని 62 ఏళ్ల మహిళ సృష్టించిన ఘతన తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. పాలు అమ్మి ఒక్క సంవత్సరంలోనే ఆమె ఎంత సంపాదించిందో తెలుసా..అక్షరాలా కోటి 10 లక్షల రూపాయాలు. ఆవులు, గేదెలను పెంచుతూ వాటిపై ఒక్క సంవత్సరంలో కోటి రూపాయాల ఆదాయాన్ని దాటేసింది. తన నలుగురు కొడుకులు సంవత్సరం అంతా సంపాదించిన మొత్తాన్ని లెక్కేసినా ఆమె ఆదాయంలో సగం కూడా కాదని తేలింది. గుజరాత్ లో పాల విప్లవాన్ని సృష్టించిన 2020 సంవత్సరంలో ఆ 62 ఏళ్ల మహిళ పేరు నావల్‌బెన్ దల్సాంగ్‌భాయ్ చౌదరి.

గుజరాత్ లోని బనస్కాంత జిల్లాలోని నాగన గ్రామానికి చెందిన నావల్‌బెన్ దల్సాంగ్‌భాయ్ చౌదరి ఆ జిల్లాలో కొత్త విప్లవాన్ని సృష్టించింది. 2019లో ఆమె చిన్నగా కొన్ని గేదెలు, ఆవులతో ఓ డెయిరీని ప్రారంభించింది. దాన్ని కష్టపడి క్రమ క్రమంగా అభివృద్ధి చేసింది. అలా ఆమె దగ్గర ఇప్పుడు 80 గేదెలు, 40 ఆవులు ఉన్నాయి. వీటి పాలను చుట్టు పక్కల పలు గ్రామాలవారికి అమ్ముతోంది నావల్‌బెన్

ఈ సందర్భంగా నావల్‌బెన్ మాట్లాడుతూ..కొన్ని గేదెలు,ఆవులతో ప్రారంభించిన డెయిరీతో చాలా సంతోషంగా ఆదాయాన్ని పొందుతున్నాననీ తెలిపారు. ఈ డెయిరీ వ్యాపారంతో 2019లోనూ 87.95 లక్షల విలువైన పాలను విక్రయించానని..అలాగే 2020లో రూ.1.10 కోట్ల విలువైన పాలను అమ్మానని తెలిపారు.

మా జిల్లాలో పాల వ్యాపారంలో నేనే నం.1 అని నావల్‌బెన్ దల్సాంగ్‌భాయ్ గర్వంగా చెబుతుంటారు. అలా ఆమె వ్యాపారాన్ని దినదినాభివృద్ది చేసుకుంటూ పలువురికి ఉపాధిని కూడా కల్పించారు. నావల్‌బెన్ దల్సాంగ్‌భాయ్ వద్ద 15 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

అయినా ఆమె ప్రతీరోజూ..ఉదయాన్నే లేచి పశువులకు గడ్డి వేయటం..నీళ్లు పెట్టటం వాటి ఆలనా పాలనా చూస్తు ప్రతీ పశువుని ప్రేమ తడిమి పలుకరిస్తుంది. ఆమె స్వయంగా పాలు పితకడం ఈ 62ఏళ్ల వయస్సులోనూ మానలేదు. ఆమె సాధించిన విజయాలకు గాను ఆమె రెండు లక్ష్మీ అవార్డులు, మూడు బెస్ట్ పుష్పక్ అవార్డులను పొందారు.

డిగ్రీలు చేతబట్టుకుని ఉద్యోగాల కోసం కాళ్లరిగేలా తిరిగే ఎంతోమంది యువత కేవలం ఉద్యోగాల కోసమే కాకుండా స్వయం ఉపాధి బాట పడితే అటు దేశఆర్థిక పరిస్థితులతో పాటు స్వంత ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. నెలకు పది, ఇరవై వేల రూపాయల కోసం పట్టణాల బాట పట్టేవారు ఎందరో ఉన్నారు.

నిరుద్యోగభారతాన్ని ఉపాధి భారతంగా మార్చే సత్తా ఈ 62 ఏళ్ల నావల్‌బెన్ దల్సాంగ్‌భాయ్ లాంటివాళ్లకు కూడా ఉందని నిరూపించారామె. ఇటువంటి వారిని యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 62 ఏళ్ల మహిళ ఉన్న ఊరిలోనే నెలకు రూ. 3.5 లక్షలు సంపాదించి తన నలుగురు కొడుకుల ఆదాయం కంటే రెట్టించి ఆర్చించారామె. అంటే రోజుకు పది వేలకు పైగానే సంపాధించిందన్నమాట.

కేవలం పాల వ్యాపారం ద్వారానే ఆ మహిళ ఇంతగా సంపాదించింది. 2020లో ఆమె అమ్మిన పాల విలువ రూ. 1.10 కోట్లు. ఇది ఆమెకు నలుగురు కొడుకులు సంవత్సర ఆదాయం కంటే రెట్టింపు. వారు అమ్మ ఆదాయంలో సగం కూడా సంపాదించలేకపోవటం విశేషం. సంకల్ప బలం ఉంటే వయస్సు అడ్డురాదని..ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ఈ గుజరాతీ మహిళ నావల్‌బెన్ దల్సాంగ్‌భాయ్.